RevanthReddy : మరో మంచి పని చేసిన రేవంత్ రెడ్డి.. అందరూ ఆయన బాటలో నడిస్తే..

RevanthReddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరో మంచి పని చేశారు. ఇప్పటికే ఆయన తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని గాంధీ ఆస్పత్రి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో అభాగ్యులకు నిత్యాన్నదానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ యువనేత ఇవాళ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బొల్లారం ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ‘‘కొవిడ్ కష్ట కాలంలో నా మల్కాజ్ గిరి నియోజకవర్గ ప్రజల వైద్య సేవకు బొల్లారం ఆస్పత్రి రెడీ అయింది. మొదటి దశలో 50 పడకల సామర్థ్యంతోపాటు 50 ఆక్సీజన్ సిలిండర్లు, ఇతర సిబ్బంది, అవసరమైన మందులు, వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేశాం. నా సెగ్మెంట్ ప్రజలకు ఈ అత్యవసర పరిస్థితుల్లో ఇది కొంతైనా ఊరటనిస్తుందని ఆశిస్తున్నాను’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

RevanthReddy : malkajgiri mp revanthreddy good initiatives
RevanthReddy : malkajgiri mp revanthreddy good initiatives

విమర్శలకే పరిమితం కాదు..

ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా సమయంలోనూ నిత్యం ప్రజల్లో ఉంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోపాలని ఎప్పటికప్పుడు పట్టి చూపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఘాటుగా విమర్శించేందుకు సైతం వెనకాడట్లేదు. అదే సమయంలో కేవలం తప్పులెన్నటానికే పరిమితం కాకుండా ప్రజలకు తన వంతు సాయం చేస్తున్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గ ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని బొల్లారం పీహెచ్ సీని 50 పడకల కరోనా ఆస్పత్రిగా మార్చాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ఈ హాస్పిటల్ ని దత్తత తీసుకొని డెవలప్ చేశారు. ఎంపీ నిధులతోపాటు సొంత నిధులతో అవసరమైన ఫర్నీచర్ ని, వైద్య పరికరాలను కొనుగోలు చేశారు. ఈ ఆస్పత్రి అభివృద్ధి కోసం సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

అందరూ ఇలాగే చేస్తే : RevanthReddy

రాష్ట్రంలోని ప్రతి గ్రామ స్థాయి నుంచి, మండలం, అసెంబ్లీ, శాసన మండలి, లోక్ సభ, రాజ్యసభ నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్లంతా ఓట్ల కోసం ఎలక్షన్ టైమ్ లో గల్లీగల్లీకి తిరిగినవాళ్లే. కానీ ఇప్పుడు ఆ ఓటర్లు, ఆ జనం కొవిడ్ కారణంగా అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సొంత నిధులతో కాకపోయినా కనీసం ప్రభుత్వం ఇచ్చే డబ్బులనైనా దగ్గరుండి ఖర్చు పెట్టి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.