Revanth: హ్యాట్సాఫ్ రేవంత్ రెడ్డి..

Revanth: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈరోజు శనివారం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వద్ద ఇకపై రోజూ వెయ్యి మందికి ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది, రోగులు, వాళ్ల బంధువులు, అంబులెన్సుల డ్రైవర్లు.. ఇలా అందరికీ ఈ సర్వీస్ అందిస్తామని స్పష్టం చేశారు. లాక్ డౌన్ కొనసాగినన్నాళ్లు ఇది కంటిన్యూ అవుతుందని చెప్పారు. లాక్ డౌన్ వల్ల చాలా మందికి బయట కనీసం తిండి దొరకట్లేదని, ఎంతో మంది చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా అష్టకష్టాలు పడుతున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Revanth Reddy Free Meal

హైకమాండ్ ఆదేశాలతో..

తమ పార్టీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ అన్నదానాన్ని ప్రారంభించినట్లు ఎంపీ వెల్లడించారు. యువజన కాంగ్రెస్ కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. అయితే కేసీఆర్ సర్కారు విచారణల పేరుతో అరెస్టులు చేస్తూ వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. గాంధీ హాస్పిటల్ కొవిడ్ కేర్ సెంటర్ అయినప్పటికీ కనీస వసతులు కరువయ్యాయని విమర్శించారు. సిటీలో రూ.5కే భోజనం పెట్టే పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రారంభించిందని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ఈ భోజన కార్యక్రమాన్ని కొనసాగించట్లేదని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు.

Revanth Reddy Free Meal

వసూల్ రాజాల భేటీ..

మంత్రి కేటీఆర్ నాయకత్వంలో కరోనాపై కేసీఆర్ ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ నిన్న శుక్రవారం ప్రగతి భవన్ లో భేటీ కావటంపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వాళ్లందరూ వసూల్ రాజాలే అని, సిగ్గు లేకుండా సమావేశం అయ్యారని ఎద్దేవా చేశారు. డాక్టర్లు ఎవరూ సభ్యులుగా లేని ఆ కమిటీ అవసరమైన సమస్యల పరిష్కారం కోసం మీటింగు పెట్టుకోలేదని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలతో కలిసి దొరికినకాడికి దండుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా అందరికీ కొవిడ్ టీకాలు వేయాలని డిమాండ్ చేశారు. కరోనా ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని కోరారు. పేరెంట్స్ చనిపోయి అనాథులుగా మిగిలిన పిల్లలకు ఛత్తీస్ గఢ్ గవర్నమెంట్ రూ.5 వేలు ఇస్తోందని, తెలంగాణలోనూ ఇవ్వాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సూచించారు.

revanth