Sanjay Raichura : ఈటెల స‌మ‌క్షంలో బీజేపీలో చేరిన న‌టుడు సంజ‌య్

NQ Staff - August 14, 2022 / 12:35 PM IST

151563Sanjay Raichura : ఈటెల స‌మ‌క్షంలో బీజేపీలో చేరిన న‌టుడు సంజ‌య్

Sanjay Raichura : తెలంగాణ‌లో పాగా వేసేందుకు బీజేపీ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తుంది. ప‌లువురు ప్రముఖుల‌ని త‌మ పార్టీల‌లోకి ఆహ్వానిస్తూ గులాబీ గుండెల‌లో గుబులు పుట్టిస్తుంది. రీసెంట్‌గా సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆమె తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో కలిసి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు.

Recently film actor Sanjay Raichura Joined BJP Party

Recently film actor Sanjay Raichura Joined BJP Party

బీజేపీ ఆప‌రేష‌న్..

తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని విమర్శనాత్మకంగా స్పందించిన ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ్నించైనా బరిలో దిగుతానని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దేశానికి ఓ భరోసా అని, ఆయనను నమ్మి బీజేపీలో చేరినట్టు జీవిత వెల్లడించారు.

Recently film actor Sanjay Raichura Joined BJP Party

Recently film actor Sanjay Raichura Joined BJP Party

ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్రారంభించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత కోమ‌టిరెడ్డి ని త‌మ పార్టీలోకి ఆహ్వానించింది. అటు వ‌రంగ‌ల్ టీఆర్ ఎస్ పార్టీలో కీల‌క నేత‌, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సోద‌రుడు ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు కూడా బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. తాజాగా సినీ న‌టుడు సంజ‌య్ రాయిచుర బీజేపీ పార్టీలో చేరారు.

బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే రాజేంద‌ర్ సమ‌క్షంలో ఆయ‌న బీజేపీలో చేరారు. ఈట‌ల కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఆచార్య‌, మ‌హ‌ర్షి వంటి సినిమాల్లో ఆయ‌న న‌టించారు. దీంతో పాటు ప‌లు ద‌క్షిణ భార‌త సినిమాల్లో సీరియ‌ళ్ల‌లో న‌టించారు. మోడీ విజ‌న్‌, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ప‌ట్ల ఆక‌ర్షిత‌మై బీజేపీలో చేరుతున్నాన‌ని సంజ‌య్ తెలిపారు. ఆయ‌న చేరిక మరింత బ‌లోపేతం చేస్తుంద‌ని ఈట‌ల అన్నారు.