Puvwada Ajaykumar : పోలవరం పంచాయితీ.! ఆ గ్రామాలు తెలంగాణలో కలపాల్సిందే.!

NQ Staff - July 19, 2022 / 07:23 PM IST

Puvwada Ajaykumar : పోలవరం పంచాయితీ.! ఆ గ్రామాలు తెలంగాణలో కలపాల్సిందే.!

Puvwada Ajaykumar : పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తాము పదే పదే కోరుతున్నట్లు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని వున్న ఐదు గ్రామాల ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వాటిని తెలంగాణలో కలపాలనీ తెలంగాణ మంత్రి పువ్వాడ డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిజానికి, ఇప్పుడంటే భద్రాచలం తెలంగాణలో వుందిగానీ, ఒకప్పుడు అది ఆంధ్ర రాష్ట్రంలో అంతర్భాగం. తూర్పుగోదావరి జిల్లాలో వుండేది. భద్రాచలం రెవెన్యూ డివిజన్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాల్లో అంతర్భాగం ఒకప్పుడు.

కలిపి, విభజించి..

 Puvwada Ajaykumar Comments Are Lot Trouble

Puvwada Ajaykumar Comments Are Lot Trouble

పరిపాలనా సౌలభ్యం, కనెక్టివిటీ.. ఇలా చాలా కారణాలు చూపి, భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ని తూర్పుగోదావరి జిల్లా నుంచి వేరు చేసి, ఖమ్మం జిల్లాలో కలిపారు.. ఇది సమైక్య రాష్ట్రంలో జరిగిన వ్యవహారం. అప్పుడంటే, ఒకే రాష్ట్రం గనుక వివాదమేమీ లేదు.

ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయో, అప్పుడు భద్రాచలం అంశం వివాదాస్పద మయ్యింది. భద్రాచలం పట్టణం, దాంతో పాటు కొన్ని గ్రామాల్ని తెలంగాణలోనే వుంచి, అప్పటి ఖమ్మం జిల్లాలోని చింతూరు, కూనవరం తదితర ప్రాంతాల్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు విభజన నేపథ్యంలో. అది కూడా పోలవరం ముంపు ప్రాంతం పేరుతో.

అప్పటినుంచి ఇప్పటిదాకా రచ్చ కాస్త నెమ్మదిగానో, గట్టిగానో కొనసాగుతూనే వుంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో భద్రాచలం ముంపుకు గురికావడంతో ముంపు ప్రాంతాలు, పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంశంపై పంచాయితీ షురూ అవడం గమనార్హం.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us