జిహెచ్ఎంసి ఎన్నికలు : ముగిసిన ఎన్నికల పోలింగ్. గతంలో కంటే ఇదే దారుణమైన పోలింగ్.
Admin - December 2, 2020 / 04:38 PM IST

జిహెచ్ఎంసి ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. అయితే గతంలో కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. వాస్తవానికి గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశించిన ఆ ఆశాలు అన్ని అడియాశలు అయ్యాయి. ఇక జిహెచ్ఎంసి సర్కిళ్లలో మొత్తం 149 డిజిజన్లకు గాను ఎన్నికలు జరిగాయి. అయితే ఓల్డ్ మల్లక్ పెట్ లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో ఆ ఎన్నికను ఎల్లుండి నిర్వహించనున్నారు. ఇక ఒకవైపు నగరవాసులు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపెట్టలేదు. ఎక్కువగా యువకులు, వృద్దులు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక పోతే సంపన్నులు నివసించే ప్రాంతాల్లో కూడా పోలింగ్ తక్కువగా నమోదు కాగా, బస్తీల్లో కాస్త ఎక్కువగా నమోదు అయింది. అయితే సాయంత్రం 4 గంటల వరకు 30 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక దీన్నిబట్టి చూస్తే గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం దారుణంగా పడిపోయిందని ఈసీ భావిస్తుంది. ఇక ఒకవైపు ఓటు వినియోగించుకోవాలని అవగాహనా కల్పించిన ఓటు వేయడానికి మాత్రం ఆసక్తి చూపలేదు. అయితే కరోనా వల్లే ఓటు వేయడనికి రాలేదని ప్రచారం జరుగుతుంది. ఇక ఏది ఏమైనప్పటికి ఈ ఎన్నికలు మాత్రం కాస్త నిరాశను కలిగించాయనే చెప్పాలి. ఇక ఈ ఎన్నికల ఫలితాలను 4వ తేదీన వెల్లడించనున్నారు.