Bandi Sanjay : పాద‌యాత్ర‌లో దీక్ష‌కు బండి సంజయ్.. అరెస్ట్ చేసిన‌ పోలీసులు.. పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న‌ బీజేపీ శ్రేణులు

NQ Staff - August 23, 2022 / 12:48 PM IST

Bandi Sanjay : పాద‌యాత్ర‌లో దీక్ష‌కు బండి సంజయ్.. అరెస్ట్ చేసిన‌ పోలీసులు.. పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న‌ బీజేపీ శ్రేణులు

Bandi Sanjay : ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ఒకరిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డ‌మే కాకుండా దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. అయితే లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నగర నేతలు కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పెద్ద ఎత్తున మహిళా నేతలు తరలివచ్చారు. ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

సంజయ్ అరెస్ట్..

ఈ సంఘటనలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్​చేశారు. పోలీసుల తోపులాటలో ఓ బీజేపీ కార్యకర్త స్పృహతప్పి పడిపోయారు. కవిత ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను అరెస్ట్​చేశారు.

Police Arrested Bandi Sanjay

Police Arrested Bandi Sanjay

ఆందోళనల సమయంలో బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా బండి సంజయ్ ఇవాళ దీక్ష చేయాలని ప్లాన్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తాను బస చేసిన చోటే దీక్ష చేసేందుకు ప్రయత్నించారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు.

బండి సంజయ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా రోడ్డుపై బైఠాయించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ చుట్టూ భద్రతా వలయంగా కార్యకర్తలు ఉండ‌గా, కార్యకర్తలను పోలీసులు ఈడ్చి ప‌డేసారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌గామ‌లో ప్ర‌స్తుతం ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

 

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us