హైదరాబాద్ మెట్రోలో సందడి చేసిన ‘ వకీల్ సాబ్ ‘
Admin - November 5, 2020 / 05:12 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రో రైలు లో పర్యటించారు. అయితే ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కోసం మాదాపూర్ నుండి మియాపూర్ వరకు మెట్రో ప్రయాణం చేసాడు. ఇక పవన్ వెంట నిర్మాత దిల్ రాజ్ కూడా ఉన్నారు. ఇక మొత్తానికి ఒక్కసారిగా మెట్రోలో పవన్ కనిపించే సరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.