NTV Reporter Jameer : తెలంగాణలో భారీ వర్షాలు : వరద నీటిలో గల్లంతయిన జర్నలిస్ట్ జమీర్.!

NQ Staff - July 13, 2022 / 10:13 AM IST

NTV Reporter Jameer : తెలంగాణలో భారీ వర్షాలు : వరద నీటిలో గల్లంతయిన జర్నలిస్ట్ జమీర్.!

NTV Reporter Jameer : తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో పరిస్థితి ఇంకాస్త భయానకంగానే వుందని చెప్పొచ్చు. భారీ వర్షాలు, వరదల్ని మీడియా కవర్ చేస్తుండడం మామూలే. జర్నలిస్టులు కొందరు, ఒకింత రిస్క్ చేసి మరీ న్యూస్ అప్డేట్స్ అందిస్తుంటారు.. మీడియా ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

NTV Reporter Jameer Washed away in floods

NTV Reporter Jameer Washed away in floods

ఓ జర్నలిస్ట్ ఇలాగే, న్యూస్ కవరేజ్ నిమిత్తం వెళ్ళి, వరదల్లో చిక్కుకుపోయాడు. సదరు జర్నలిస్టు పేరు జమీర్ అని తెలుస్తోంది. ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్, రాయికల్ వరదలో చిక్కుకున్నవారి న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళి.. నీటిలో గల్లంతయ్యాడు.

సహాయక చర్యలు ముమ్మరం..

రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలోని గోదావరి నదిలో 9 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకోగా, ఆ వార్త కవర్ చేసేందుకు ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ వెళ్ళారు. అనూహ్యంగా ముంచుకొచ్చిన వరద కారణంగా వాగులో జమీర్ తన వాహనంతో సహా కొట్టుకుపోయాడు.

గల్లంతయిన జర్నలిస్టుని కనుగొనేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆయన క్షేమంగా తిరిగొస్తాడని సాటి మీడియా సిబ్బంది ఆశిస్తున్నారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us