BRS : బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ మాత్రమే.! ఎందుకిలా.?

NQ Staff - October 7, 2022 / 07:13 PM IST

BRS : బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ మాత్రమే.! ఎందుకిలా.?

BRS : మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయబోయేది జాతీయ పార్టీయేనంటూ కొన్నాళ్ళ క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పడం చూశాం. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్, ఆ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా ఇటీవల మార్చుతూ నిర్ణయాన్ని ప్రకటించారు.

అయితే, ఈ నిర్నయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు టీఆర్ఎస్ పంపినాగానీ, బీఆర్ఎస్‌గా ఆ పార్టీని గుర్తించేందుకు కొంత సమయం పడుతుంది. పైగా, పేరు మార్పు విషయమై చాలా అడ్డంకులు కూడా వున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.

మునుగోడులో బీఆర్ఎస్ లేదాయె…

టీఆర్ఎస్ నుంచి మునుగోడులో పోటీ చేయబోయే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ బీ-ఫామ్ అందించారు. పార్టీ తరఫున ఖర్చు చేయాల్సిన నిధుల తాలూకు చెక్ (సుమారు నలభై లక్షల రూపాయలట) కూడా ఇచ్చారట.

సో, మునుగోడులో రెండు జాతీయ పార్టీలతో పాటు ఓ ప్రాంతీయ పార్టీ పోటీ పడనున్నాయన్నమాట. రెండు జాతీయ పార్టీలలో ఒకటి కాంగ్రెస్ కాగా, ఇంకొకటి బీజేపీ. బీజేపీది మూడో స్థానమేనని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితినే మూడో స్థానంలోకి వెళుతుందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతుండడం గమనార్హం.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us