Bonthu Rammohan : నన్నెవరూ అరెస్ట్ చేయలేదు: టీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్
NQ Staff - December 1, 2022 / 11:18 AM IST

Bonthu Rammohan : తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత, హైద్రాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ని ఫిక్సింగ్ కేసులో సీబీఐ అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రచారాన్ని బొంతు రామ్మోహన్ ఖండించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడారు బొంతు రామ్మోహన్. కవిత పేరుని ఈడీ ఓ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించగా, ఆ విషయమై కవిత నేడు మీడియా ముందుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారామె. కవితతో పాటుగా రామ్మోహన్ కూడా మీడియా ముందుకొచ్చి తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు.
నోటీసులు అందలేదు.. నన్నెవరూ అరెస్టు చేయలేదు..
ఫిక్సింగ్ కేసు కాదు.. ఇంకే కేసూ కాదు.. నన్నెవరూ అరెస్టు చేయలేదు, నాకు నోటీసులు కూడా ఎవరూ ఇచ్చింది లేదు.. అంటూ బొంతు రామ్మోహన్ మీడియాకి స్పస్టతనిచ్చారు.
‘నా మొబైల్ పనిచేయలేదు.. దాంతో, నేనేదో అరెస్టయ్యాననే నిర్ణయానికి మీరు వచ్చేస్తే ఎలా.?’ అంటూ మీడియాపై గుస్సా అయ్యారు బొంతు రామ్మోహన్. శ్రీనివాస్ అనే వ్యక్తితో ఓ ఫంక్షన్లో పరిచయమన్న బొంతు రామ్మోమన్, అతనికి గనుక విచారణ సంస్థలు నోటీసులిస్తే ఆయనే వివరణ ఇచ్చుకుంటాడనీ, తనకు నోటీసులు వస్తే తానూ సమాధానమిస్తానని అన్నారు.