తెలంగాణలో కొత్త రకం వైరస్ కల్లోలం.. భయంతో వణికిపోతున్న ప్రజలు
Samsthi 2210 - December 23, 2020 / 05:05 PM IST

కరోనా మహమ్మారి కల్లోలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ ఏడాది మొత్తం ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తుంది అనుకునే లోపే మరో కొత్త రకం వైరస్ ఇప్పుడు గుబులు పుట్టిస్తుంది. బ్రిటన్‌లో ఈ కొత్త తరహా వైరస్‌ని కనుక్కోగా, అది చాలా స్పీడ్‌గా వ్యాపిస్తుందట. దీంతో అక్కడ కొన్ని వారాల పాటు లాక్‌డౌన్ విధించారు. మిగతా దేశాలు బ్రిటిన్‌తో పూర్తిగా రవాణా వ్యవస్థను రద్ధు చేశాయి. మనదేశం కూడా ముందస్తు జాగ్రత్తగా ఫ్లైట్స్ రద్దు చేయడంతో పాటు విదేశాల నుండి వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుంది.
అయితే గత నెల రోజుల నుంచి యూకే, తదితర ప్రాంతాల నుంచి సుమారుగా 3 వేల మంది ప్రయాణికులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మన రాష్ట్రానికి 355 మంది వచ్చినట్టు గుర్తించిన ఆరోగ్య శాఖ వారికి పరీక్షలు చేయగా ఇందులో కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు . అయితే ఈ వైరస్ కొత్త తరహా వైరస్సా లేదా అనేది గుర్తించేందుకు నమూనాలను పుణే ప్రయోగశాలకు పంపారు. ఇక యూకేలో వణికిస్తున్న కొత్త తరహా వైరస్ చాలా స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుందని, అందుకే రానున్న పండుగలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ప్రజా ఆరోగ్య చాలకులు డా. శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డి స్పష్టం చేశారు.
మరో ప్రచారం ఏమంటే బ్రిటన్‌లో రెట్టింపు వేగంగా వ్యాపిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అంత డేంజర్ ఏం కాదనే టాక్ వినిపిస్తుంది. ఈ వైరస్‌లోను పాత లక్షణాలే కనిపిస్తున్నాయి. కేవలం వ్యాప్తి ఎక్కువగా అవుతుంది తప్ప పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటూ సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర అన్నారు. కేసులు ఎక్కువైతే ఆసుపత్రులలో నిర్వాహణ కష్టం అవుతుంది. అందుకే వైరస్ ప్రమాదం కాదని ఎవరు నిర్లక్ష్యం చేయోద్దంటూ ఆయన హితవు పలికారు.