Munugodu : మునుగోడు బై పోల్స్ : ఇంతటి వేడిలో కేఏ పాల్ భలే చల్లబర్చుతున్నాడు

NQ Staff - October 31, 2022 / 08:53 AM IST

Munugodu : మునుగోడు బై పోల్స్ : ఇంతటి వేడిలో కేఏ పాల్ భలే చల్లబర్చుతున్నాడు

Munugodu : మునుగోడు ఉప ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఉప ఎన్నికలను సిట్టింగ్ పార్టీ అయిన కాంగ్రెస్, అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ మరియు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్తు నిర్ణయించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యం లో ఈ మూడు పార్టీలు కూడా వాడి వేడిగా ప్రచారం చేస్తున్నాయి.

వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఎన్నికల హడావుడి నిర్వహిస్తున్నాయి. విమర్శలు, దాడులు ఇలా రచ్చ రచ్చ జరుగుతున్న సమయంలో కాస్త ఆట విడుపు అన్నట్లుగా కేఏ పాల్ ప్రచారం ఉంది.

ఆయన మీడియా ముందు పడుకోవడం, వ్యవసాయం చేయడం, గొర్లను కాయడం, పత్తి ఏరడం.. ఇలా చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ మీడియాలో ఉండడం వల్ల కేఏ పాల్ ఈరోజు ఏం చేస్తున్నాడు అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఇంత రచ్చ సమయంలో కేఏ పాల్ వంటి వ్యక్తి పోటీలో ఉండడం కచ్చితంగా వాతావరణాన్ని చల్లబరుస్తుంది అంటూ అభిప్రాయం అవుతుంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా తాను గెలుస్తానంటూ కేఏ పాల్ ధీమాతో ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయం ఓటర్లు తేల్చి చెప్పబోతున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us