మోడీ హైదరాబాద్ పర్యటనపై స్పందించిన ఎంపీ రేవంత్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. అయితే ప్రధాని మోడీ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న హకీమ్ పెట్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నారని, కానీ లోకల్ ఎంపీ కి కూడా కనీసం సమాచారం లేదని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నందున ఒక లోకల్ ఎంపీ ని పిలవకపోవడం ఏంటని ట్వీట్టర్ ద్వారా వెల్లడించాడు.

revanth

వివరాల్లోకి వెళితే మోడీ పూణే లో పర్యటించిన అనంతరం సాయంత్రం హైదరాబాద్ రానున్న షెడ్యూల్ లో కాస్త మార్పులు సంభవించాయి. దీనితో ముందుగానే హైదరాబాద్ కు పయనం కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం హక్కింపెట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు ప్రధాని. ఇక చేరుకున్న వెంటనే స్వదేశములో తయారు చేస్తున్న మొట్టమొదటి కరోనా కోవ్యాక్సిన్ భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. అనంతరం వ్యాక్సిన్ పురోగతి పై ఆ సంస్థతో సమావేశం కానున్నారు.

ఇక ఈ సమావేశం అయిపోయిన వెంటనే హాక్కింపెట్ ఎయిర్ పోర్ట్ నుండి తిరిగి అహమ్మదాబాద్ బయల్దేరనున్నారు. ఇక ఈ పర్యటన విషయంలో మల్కాజిగిరి ఎంపీ కి సమాచారం ఇవ్వకపోవటంతో ఆయన స్పందించారు. అయితే సీఎం కెసిఆర్ కు కూడా సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది. మొత్తానికి మోడీ లోకల్ నాయకులకు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement