అదిరిపోయే పంచ్ వేసిన ధర్మపురి అరవింద్. ఇక ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిక్కుల్లో పడినట్లే..!

జిహెచ్ఎంసి ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ మాత్రం దుబ్బాకలో గెలిచిన తరువాత మరింత జోష్ మీద కనిపిస్తుంది. ఇక ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ ఇక్కడ ఎమ్మల్యే గా ఉన్న సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వెళ్లడంట కదా.. ఆయన కొన్ని రోజుల నుండి టీఆర్ఎస్ లో కూడా హ్యాపీ గా లేడంట. త్వరలో బీజేపీ లోకి వస్తాడంట ‘ అని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇక ఈ వ్యాఖ్యలతో ఎమ్మల్యే సుధీర్ రెడ్డి కాస్త చిక్కుల్లో పడ్డాడనే తెలుస్తుంది.

Advertisement