Modi : మోడీ నో ఎంట్రీ తెలంగాణ.. చేనేత యూత్‌ ఫోర్స్ డిమాండ్‌

NQ Staff - November 10, 2022 / 12:56 PM IST

Modi : మోడీ నో ఎంట్రీ తెలంగాణ.. చేనేత యూత్‌ ఫోర్స్ డిమాండ్‌

Modi : తెలంగాణలో పర్యటించబోతున్న ప్రధాని నరేంద్ర మోడీకి మరో సారి నిరసన సెగ తగలబోతుంది. మోడీ నో ఎంట్రీ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఆయన పర్యటనను అడ్డుకునేందుకు తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరిట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది.

రామగుండంతో పాటు కరీంనగర్, హైదరాబాద్ ఇంకా రాష్ట్రంలోని పలు చోట్ల మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో బిజెపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది టిఆర్ఎస్ నాయకుల పనే అంటూ వారు విమర్శిస్తున్నారు.

తెలంగాణలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటం వల్ల మోడీ పర్యటనకు నిరసన తగిలేలా ఉందంటూ మొదటి నుండే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జీఎస్టీ ని చేనేత కార్మికులపై విధించడంతో ఈ ఆందోళన మొదలైంది.

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మరింతగా తమ ఆందోళన ఉంటుందంటూ తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ కి చెందినవారు చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను అడ్డుకొని ఇలా నిరసనలు తెలిపితే రచ్చ మరింతగా పెరికే అవకాశాలు లేకపోలేదు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us