MLC Kavitha : అరెస్టు చేసి జైల్లో పెడితే ఏమైతది.! ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.!

NQ Staff - December 1, 2022 / 02:51 PM IST

MLC Kavitha : అరెస్టు చేసి జైల్లో పెడితే ఏమైతది.! ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.!

MLC Kavitha : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకి రంగం సిద్ధమయ్యిందా.? అంటే, ఔననే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ఆ లెక్క వేరే వుంటుంది. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుడికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు రావడమంటేనే.. ఆమె ఈ కేసులో బుక్కయిపోయినట్లు లెక్క.. అన్నది చాలామంది అభిప్రాయం.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి వంద కోట్ల ముడుపుల వ్యవహారాన్ని నడిపినవారిలో కవిత ముఖ్యులన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. దీనికి తగ్గట్టుగానే ఈడీ, తాము ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుడి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది.

అరెస్టు భయంలో కవిత వున్నారా.?

‘అరెస్టయితే ఏమవుతుంది.? జైల్లో పెడతారా.? పెట్టుకోండి..’ అంటూ తాజాగా కవిత వ్యాఖ్యానించారు. ‘మీరు అరెస్టు చేయాలనుకుంటే చేయండి.. కానీ, లీకులు పంపి ఇమేజ్ చెడగొట్టే ప్రయత్నం చెయ్యొద్దు. కేసులు మాకు కొత్త కాదు. మాది ఉద్యమ నేపథ్యం..’ అంటూ కవిత ఒకింత ఉద్వేగంగా ప్రసంగించారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో టీఆర్ఎస్ సర్కారు గనుక, బీజేపీ నేతల అరెస్టుకి సిద్ధపడితే, అంతకన్నా ముందే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. కాగా, అరెస్టు వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం వుందనీ, ఈ వ్యాఖ్యలతో కవిత సింపతీ పొందాలనుకుంటున్నరనే వాదనా లేకపోలేదు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us