MLC Kavitha : ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శ

NQ Staff - August 5, 2022 / 10:27 PM IST

149546MLC Kavitha : ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శ

MLC Kavitha : టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఇటీవల హత్యాయత్నం జరిగిన విషయం విదతమే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని ఎమ్మెల్యని అడిగి తెలుసుకున్నారు.

MLC Kavitha met with MLA Jeevan Reddy

MLC Kavitha met with MLA Jeevan Reddy

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒకింత బలమైన వాయిస్ వినిపించే నాయకుల్లో జీవన్ రెడ్డి ఒకరు. మీడియా డిస్కషన్స్‌లో అధికార పార్టీ తరఫున చాలా చాలా గట్టిగా మాట్లాడుతుంటారాయన. అలాంటి జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి జీర్ణించుకోలేకపోతోంది.

ప్రజా స్వామ్యంలో దాడులకు చోటు లేదు..

జీవన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని ఖండించిన ఎమ్మెల్సీ కమిత, నిందితుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవన్ రెడ్డిపై హత్యా యత్నం నేపథ్యంలో షాక్‌కి గురైన ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు కవిత. ధైర్యంగా వుండాలని, పార్టీ అండగా వుంటుందని వారికి భరోసా ఇచ్చారు.

ఘటన జరిగినప్పటినుంచీ, పలువురు టీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డిని పరామర్శిస్తూ వస్తున్నారు. ఆయనకు భద్రతను కూడా పెంచింది ప్రభుత్వం.