MLC Kavitha : ‘లండన్ బతుకమ్మ సంబరాలు’ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
Sravani Journalist - September 6, 2022 / 06:58 PM IST

MLC Kavitha : తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బంజారా హఇల్స్‌లోని తన నివాసంలో ‘లండన్ బతుకమ్మ దసరా సంబరాలు’ పోస్టర్‌ని ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి తరఫున కవిత, బతుకమ్మ సంబరాల్ని ఘనంగా ప్రమోట్ చేశారు. ఆ బతుకమ్మ సంబరాలతో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సెంటిమెంట్ ఉధృతం చేయడంలో తనవంతు కీలక పాత్ర పోషించారు.
కాగా, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఘనంగా చేనేత బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.
ఎమ్మెల్సీ కవితకు ప్రతినిథుల ఆహ్వానం..

MLC Kavitha Launches Posters Of London Bathumakamma Celebrations
లండణ్‌లో జరిగే తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ చేనేత బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సిందిగా ప్రతినిథులు ఆహ్వానం పలికారు. ఫిలిం డెవలప్మెంట్ ఛైర్మన్లు అనిల్ కూర్మాచలం, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజవ్ సాగర్ ఈ మేరకు కవితకు ఆహ్వానం అందించారు.
దేశ విదేశాల్లో బతుకమ్మ సంబరాల్ని తెలంగాణ బ్రాండ్‌గా మలచి, తెలంగాణ బ్రాండ్‌ని విశ్వ వ్యాపితం చేయడంలో తనవంతు పాత్ర పోషించిన కవితకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభిస్తోంది.