MLC Kavitha : విచ్ఛిన్నకారులపై ఉక్కుపాదం : కవులు కలానికి పదును పెట్టాలన్న కల్వకుంట్ల కవిత

NQ Staff - November 20, 2022 / 10:34 PM IST

MLC Kavitha : విచ్ఛిన్నకారులపై ఉక్కుపాదం : కవులు కలానికి పదును పెట్టాలన్న కల్వకుంట్ల కవిత

MLC Kavitha : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత, ఢిల్లీలో జరిగిన ఆజ్‌తక్ సాహిత్య సమ్మేళనంలో, కీలక వ్యాఖ్యలు చేశారు.

సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపాలనీ, కవులు ఈ దిశగా తమ కలానికి పదును పెట్టి, సమాజాన్ని ఐక్యంగా వుండేలా కృషి చేయాలని కవులకు, రచయితలకు కవిత పిలుపునిచ్చారు. దేశంలో సమాజాన్ని విడదీసే వాతావరణాన్ని మనం చూస్తున్నామని ఆమె అన్నారు.

భారత్ జాగృతి – ఇండియా టుడే సంయుక్త పురస్కారం

సాహిత్య రంగానికి విశేషంగా కృషి చేసినవారికి వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్ – ఇండియా టుడే సంస్థ సంయుక్తంగా సాహిత్య పురస్కారాన్ని అందించనున్నట్లు కవిత పేర్కొన్నారు. సాహిత్యం, జ్ఞానాన్ని ఇస్తుందని చెప్పారు కవిత.

‘యువతకు సాహిత్యం అర్థం కాదని, సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడంలో కలిసి రావడంలేదని కొందరు అంటారు.. కానీ, ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున యువత పాల్గొనడం గర్వంగా వుంది’ అని చెప్పారు కవిత. సాహిత్య ప్రేమికురాలిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు కవిత. శబ్దమే శక్తి అని తాను విశ్వసిస్తాననీ, ఒక శబ్దం లక్షలాది హ‌దయాల్ని కదిలిస్తుందని అన్నారామె.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us