Minister Puvwada Ajay Kumar : జనసేనాని ‘వారాహి’పై తెలంగాణ మంత్రి ఎందుకు స్పందించారో.!
NQ Staff - December 13, 2022 / 11:24 AM IST

Minister Puvwada Ajay Kumar : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ రథం ‘వారాహి’పై స్పందించారు. పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న విషయం విదితమే.
‘వారాహి’ వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పేర్కొనడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యవహారంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలు తమ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు ఈ వాహనం గురించి.
కొందరు మంత్రులైతే కనీసపాటి అవగాహన లేకుండా ‘వారాహి’ వాహనం గురించి ఏవేవో అంటున్నారు. తెలంగాణలో వాహనం రిజిస్ట్రేషన్ అయితే మాకేంటి.? ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాక, వేరే నిబంధనలుంటాయ్.. అంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు.
తెలంగాణ మంత్రి ఎందుకు స్పందించినట్లు.?
ఎవరన్నా అడిగితే స్పందించడం వేరు.. తనంతట తానుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ‘వారాహి’ వాహనంపై సోషల్ మీడియా వేదికగా స్పందించడం వేరు. గతంలో సామాజిక వర్గం పేరుతో పువ్వాడ అజయ్ కుమార్ మీద ఏపీలోని అధికార పార్టీ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో టిట్ ఫర్ టాట్ అన్నట్లు పువ్వాడ వ్యవహరంచారా.? అన్న చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ ఏమైనా తెలంగాణ రాష్ట్ర సమితికి (ఇప్పుడు బీఆర్ఎస్ అయ్యింది) రాజకీయంగా మద్దతిస్తారా.? అన్న అనుమానాలూ షురూ అయ్యాయ్.