Minister KTR : మహేష్‌బాబులా కేటీయార్.! గంగవ్వ ప్రశంసకి, కేటీయార్ మార్కు స్పందన.!
NQ Staff - October 3, 2022 / 04:25 PM IST

Minister KTR : గంగవ్వ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెకి చెందిన ఓ వృద్ధ మహిళ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా. బిగ్ బాస్‌లోనూ ఆమె సందడి చేసిన విషయం విదితమే. అప్పట్లో గంగవ్వకి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న గంగవ్వ తాజాగా కరీంనగర్ కళోత్సవం కార్యక్రమాల్లో సందడి చేసింది. తెలంగాణ మంత్రి కేటీయార్‌ని ఉద్దేశించి, ‘మహేష్‌బాబులా వున్నాడు కేటీయార్..’ అంటూ వ్యాఖ్యానించింది గంగవ్వ. దాంతో, కేటీయార్ ముగ్దుడైపోయారు.
విలేజ్ షోకి వస్తానని గంగవ్వకు మాటిచ్చిన కేటీయార్..
నన్ను మహేష్‌బాబుతో పోల్చావ్.. నేనే హ్యాపీనే.. కానీ.. అంటూ కేటీయార్ తనదైన స్టయిల్లో స్పందిస్తూ, గంగవ్వని నేరుగా ఇంటవరకూ కలవలేదనీ, ఆమె చాలామంచిదనీ, మై విలేజ్ షో కార్యక్రమానికి హాజరవుతాననీ గంగవ్వకు వేదిక మీదనే హామీ ఇచ్చారు కేటీయార్.
‘మై విలేజ్ షో కార్యక్రమానికి హాజరవుతాను.. నేనూ కొన్ని నేర్చుకుంటాను. నాకు తెలిసినవి చెబుతాను..’ అని కేటీయార్ చెప్పడంతో గంగవ్వ మురిసిపోయింది.
గంగవ్వ అంటే తెలంగాణ బ్రాండ్.. అంటారు చాలామంది. అన్నట్టు, బిగ్ బాస్ రియాల్టీ షోలో తనకు ఓ ఇల్లు కట్టివ్వమని నాగార్జునని నేరుగా గంగవ్వ అడిగేస్తే, అందుకు అనుగుణంగా నాగ్ ఆర్థిక సాయం చేసిన విషయం విదితమే.