దుబ్బాక ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న హరీష్‌ రావు.. మరి కేటీఆర్‌?

Tech Desk-2 - December 5, 2020 / 04:00 PM IST

దుబ్బాక ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న హరీష్‌ రావు.. మరి కేటీఆర్‌?

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు చాలా కారణాలు ఉన్నాయి. కాని అవి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పని చేయవు అని అంతా అనుకున్నారు. కాని దుబ్బాక ఎన్నికల్లో విజయాన్ని చూపించి బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. మేయర్‌ పీఠం దక్కించుకోలేకున్నా కూడా రెండవ అతి పెద్ద పార్టీగా నిలవడం వల్ల నైతికంగా అయితే ఘన విజయం సాధించినట్లే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను హరీష్‌ రావు మొత్తం తానై చూసుకున్నాడు. అక్కడ అభ్యర్థి మరియు విషయాలు ప్రభావితం చేశాయి అనడంలో సందేహం లేదు. అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బీజేపీ అక్కడ గెలుపొందింది. అంటే గెలుపు ముంగిట వరకు వచ్చి టీఆర్‌ఎస్‌ ఆగిపోయింది.

minister harish rao take Revenge on bjp in ghmc elections

minister harish rao take Revenge on bjp in ghmc elections

దుబ్బాకలో తనకు బీజేపీ కలిగించిన పరాభవంకు హరీస్‌ రావు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి ఒక్క మంత్రికి ఒక్కో డివిజన్‌ చొప్పున అప్పగించింది. కాని హరీష్‌ రావు మాత్రం పటాన్‌ చెరువు నియోజక వర్గం పరిధిలోని రామచంద్రాపురం, పటాన్‌ చెరువు, భారతీనగర్‌ డివిజన్ల బాధ్యతను తీసుకున్నాడు. అక్కడ ఎన్నికలకు పది రోజులు ఉండగానే పక్కా వ్యూహంతో హరీష్‌ రావు ముందుకు వెళ్లాడు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక బాధ్యుడిని హరీష్‌ రావు నియమించాడు. ఆ వంద మంది వద్దకు నేరుగా వెళ్లి మాట్లాడటం ప్రతి ఒక్కరికి మొబైల్‌ ద్వారా టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన మెసేజ్‌ లను పంపించడం చేశారు. ప్రతి ఒక్క ఓటరుతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మాట్లాడేలా హరీష్ రావు ప్లాన్‌ చేశాడు.

తాను కూడా గల్లీ గల్లీన తిరిగి ముగ్గురు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశాడు. పటాన్‌ చెరువు పరిధిలో హరీష్‌ రావు బాధ్యతలు తీసుకున్న మూడు డివిజన్లు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంది. ఈ విజయంతో బీజేపీపై హరీష్‌ రావు ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హరీష్‌ రావు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్లే అక్కడ పార్టీ విజయం సాధించిందని అంటున్నారు. ఇక పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా ఉన్న కేటీఆర్‌ మాత్రం ఈ ఓటమి బాధ్యతను తీసుకోవాలని.. ఆయన సరైన వ్యూహాలు అమలు చేయడంలో విఫలం అవ్వడం వల్లే పార్టీ ఓడిపోయిందంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇకపై అయినా పార్టీ వ్యూహాల తయారీలో హరీష్‌ రావుకు ప్రముఖ స్థానం ఇస్తారని ఆశిస్తున్నాం అంటూ ఆయన అభిమానులు అధినాయకత్వంకు మొర పెట్టుకుంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us