Fire Accident : ఎలక్ట్రిక్ బైక్ షో రూం లో మంటలు.. లాడ్జీలో పలువురు మృతి
NQ Staff - September 13, 2022 / 09:56 AM IST

Fire Accident : సోమవారం రాత్రి సమయంలో సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సెయింట్ మేరీస్ రోడ్డులోని మనోహర్ థియేటర్ వద్ద రంజిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటర్ల పేరుతో బైక్ షో రూం నడుపుతున్నాడు. ఈ షో రూం పైన రూబీ డీలక్స్ హోటల్ కమ్ లాడ్జ్ ఉంది.

massive fire accident electric bike showroom in secunderabad
రాత్రి సమయంలో స్కూటర్ల షో రూంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు లాడ్జీ ఉన్న రెండవ అంతస్తు మరియు మూడవ అంతస్తుకు పాకాయి. ప్రమాద సమయంలో ఆదమరచి నిద్ర పోతున్న వారు కళ్లు తెరచి చూసేప్పటికి మంటల్లో చిక్కుకుని ఉన్నారు.
పలువురు మంటల నుండి బయటకు రాలేక అగ్నికి ఆహుతి అయ్యారు.. కొందరు తీవ్ర గాయాలతో బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగ ప్రవేశం చేసినా కూడా అప్పటికే అగ్నికి లాడ్జ్ ఆహుతి అయ్యింది.
లాడ్జీ లో మొత్తం 23 మంది ఉన్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. దట్టమైన పొగలు వ్యాప్తి చెందడటంతో వారు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని.. దాంతో కొందరు అగ్నికి ఆహుతి అయ్యారు అంటూ ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు. తెల్లవారు జాము వరకు మంటలను అదుపులోకి తీసుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది అక్కడ నుండి వెళ్లి పోవడంతో పోలీసులు తమ పని మొదలు పెట్టారు. చనిపోయిన వారి యొక్క సంఖ్య మరియు వివరాలు వెళ్లడి అవ్వాల్సి ఉంది.