KTR : కేటీఆర్ సీఎం అయితే మేము ఏంటి ..మంత్రుల సంచలన వ్యాఖ్యలు

KTR (కేటీఆర్): తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సీఎం ఎవరు? అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత సీఎం గా కేటీఆర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తరువాత ముఖ్యమంత్రి ఎవరు అనే దాని గురించి తెలంగాణ రాష్ట్రం అంతా ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణాలో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు కాస్త సంచలనంగా ఉన్నాయి. తెలంగాణ సిఎంగా కేటిఆర్ బాధ్యతలు చేపట్టాలి అంటూ కొందరు మంత్రులు అవకాశం వచిన్నప్పుడల్లా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడుస్తూ సిఎం గా కేటిఆర్ బాధ్యతలు చేపట్టాలి అంటూ తమ మనసులోని మాటలను బహిర్గతం చేసారు. అయితే ఇప్పుడు సిఎం గా కేటిఆర్ బాధ్యతలు చేపట్టే విషయంలో మాత్రం తెలంగాణాలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. కానీ సిఎం కేసీఆర్ మాత్రం తన కొడుకు కేటిఆర్ కోసం ప్రత్యేక పూజలు చేసారు అనే వ్యాఖ్యలు జోరు అందుకున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

KTR : will be next cm of Telangana..?
KTR : will be next cm of Telangana..?

ఇదిలా ఉండగా ఇప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూడాలి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏమీ మన పక్క దేశం అయిన పాకిస్థాన్ లో లేదు అని, తెలంగాణలోని ప్రజలు ఇండియాలోనే ఉన్నాం అని గుర్తుపెట్టుకోవాలి అన్నారు కరోనా విపత్తు కాలంలో తెలంగాణ ను ఏమి కేంద్రం ఆదుకోలేదు అని మండిపడ్డారు.అసలు తెలంగాణ కు బీజేపీ ఏమైనా ఉపయోగం చేసిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్యామిలీ మీద నిందలు వేస్తే కాంగ్రెస్ కిగాని బీజేపీకి గాని ఏమోస్తుందో నాకు అర్ధం కావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ గారి తరువాత సిఎం గా కేటిఆర్ బాధ్యతలు చేపడితే ఇక్కడ ప్రజలందరికి సంతోషమే అన్నారు ఆయన.

ఇంకా మరొక మంత్రి గంగుల కమలాకర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేసారు. ఎవరిని సిఎం చేయాలన్న దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు అని స్పష్టత ఇచ్చారు.మేము సిఎంగా ఎవరిని ఎంచుకుంటాము అనే దానిపై బీజేపీకి సంబంధం లేదు అని అన్నారు. ప్రజల మద్దతు మాకు ఉందని గుర్తు చేసారు. కేటీఆర్ దేనిలో అయిన తండ్రికి తగ్గా కొడుకు అని అన్నారు. అందుకే ఆయనకి సిఎం అవ్వటానికి గల అన్ని అర్హతలు ఉన్నాయి అని అన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కి రావడానికి కేటీఆర్ కారణం అని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే ఇన్ని పనులు చేస్తే ముఖ్య మంత్రి అయితే ఇంకా మన రాష్ట్రన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తారు అని పేర్కొన్నారు.. !

Advertisement