KTR : మరోమారు కోవిడ్ బారిన పడ్డ కేటీయార్.! ఐసోలేషన్‌లోకి మంత్రి.!

NQ Staff - August 30, 2022 / 07:36 PM IST

155900KTR  : మరోమారు కోవిడ్ బారిన పడ్డ కేటీయార్.! ఐసోలేషన్‌లోకి మంత్రి.!

KTR  : తెలంగాణ రాష్ట్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కోవిడ్ బారిన పడ్డారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో తాను వున్నట్లు స్వయంగా ప్రకటించారు కేటీయార్. ఇటీవల తనను కలిసినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కేటీయార్ సూచించారు.

కాగా, కొద్ది రోజుల క్రితం కేటీయార్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఆ కారణంగా కొన్ని రోజులపాటు ఆయన ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. చేతి కర్ర సాయంతో కొద్ది రోజుల క్రితమే బయటకు వచ్చారు కేటీయార్. అయితే, మళ్ళీ ఆయనిప్పుడు కోవిడ్ కారణంగా ఐసోలేషన్‌లోకి వెళ్ళాల్సి వచ్చింది.

కోవిడ్ రెండోస్సారి.!

KTR Infected With Covid Once Again

KTR Infected With Covid Once Again

కేటీయార్‌కి కరోనా సోకడం ఇది రెండో సారి. గత ఏడాది కూడా కేసీయార్ కోవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన కోవిడ్ బారిన పడ్డారు.

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ మాత్రమే కాదు, రకరకాల సీజనల్ ఫ్లూ జ్వరాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులూ కోవిడ్ బారిన పడుతున్నారు. కొందరు ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తోంది కూడా. కోవిడ్ నిబంధనలు అమలు కాకపోవడం, వ్యాక్సిన్ తీసుకున్నామన్న ధీమా.. వెరసి, కోవిడ్ చాపకింద నీరులా విస్తరించేస్తోంది.