బీజేపీ బలహీనత మీద దెబ్బ కొడుతున్న టీఆర్ఎస్ !

Admin - November 26, 2020 / 04:13 PM IST

బీజేపీ బలహీనత మీద దెబ్బ కొడుతున్న టీఆర్ఎస్ !

జిహెచ్ఎంసి ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని పార్టీలు మేనిఫెస్టో ను విడుదల చేసాయి. మొత్తానికి అన్ని పార్టీలు ఈ జిహెచ్ఎంసి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. ఇక ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గకుండా అధికార పార్టీ వైఫల్యాలను బయటపెడుతూ విరుచుకుపడుతుంది. అయితే దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు తరువాత బీజేపీ మరింత జోష్ లో ప్రచారంలో పాల్గొంటుంది.

ఇక ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ సీట్లు గెలిచి మేయర్ పదవిని దక్కించుకోవాలని ఆ దిశగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఇక ఒకవైపు ప్రచారం కోసం పలువురు బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్ కు దారి పట్టనున్నారు. ఇప్పటికే బీజేవైఎం జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 27వ తేదీన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానుండగా, 28వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, 29న అమిత్ షా జిహెచ్ఎంసి లో ప్రచారం చేయనున్నారు.

bjp planning to win in tirupati by election

ఇక ఇలా బీజేపీ కీలక నాయకులు ప్రచారంలోకి దిగుతుండడంతో మంత్రి కేటీఆర్ వాళ్లపై ఫైర్ అవుతుంది. అయితే బీజేపీ నేతలు హైదరాబాద్ ప్రచారానికి వచ్చేటప్పుడు కెసిఆర్ కేంద్రాన్ని అడిగిన 1350 కోట్ల వరద సాయాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. నగరవాసులు వరదల్లో ఇబ్బందులు పడ్డప్పుడు ఒక్కరు కూడా రాలేదని, ఓట్లు అనగానే ఎక్కడెక్కడనుండో వస్తున్నారని మండిపడ్డాడు. మొత్తానికి బీజేపీ బలహీనత మీద దెబ్బ కొట్టే దిశగా టీఆర్ఎస్ ప్రచారంలో ముందుకు వెళ్తుంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us