KTR : బండి సంజయ్ అడిగితే నా బొచ్చు కూడా ఇస్తా : కేటీఆర్‌

NQ Staff - December 20, 2022 / 08:38 PM IST

KTR : బండి సంజయ్ అడిగితే నా బొచ్చు కూడా ఇస్తా : కేటీఆర్‌

KTR : కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు సందర్భాల్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న సందర్భంగా మీడియా వారు ప్రశ్నిస్తూ బండి సంజయ్ ఆరోపణల పై మీ స్పందన ఏంటి అన్నారు.

అందుకు కేటీఆర్ కాస్త సీరియస్ గా స్పందించారు. బండి సంజయ్ పై బూతుల వర్షం కురిపించిన కేటీఆర్ ఇప్పటికిప్పుడు తాను బ్లడ్ శాంపిల్ కానీ, స్కిన్ కానీ, నెయిల్స్ కానీ.. చివరికి బొచ్చు ఇవ్వమన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.

ఒకవేళ నా శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకోనట్లుగా నిరూపితమైతే కరీంనగర్ కమాన్ దగ్గర తన చెప్పుతో తానే కొట్టుకుంటాడా అంటూ ఘాటుగా సవాల్ విసిరారు. కేటీఆర్ సహజంగా అంతా ఘాటుగా స్పందించడం ఎప్పుడూ చూడలేదు.

ఆయన నోటి నుండి ఎప్పుడు విననటువంటి బూతులు కూడా రావడంతో మీడియా వారు ఆశ్చర్య పోయారు. బండి సంజయ్ పై ఆయనకున్న అసహనం ఆ బూతుల రూపంలో వచ్చిందంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

అయితే మంత్రి అయ్యుండి అలాంటి మాటలు మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు కేటీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ నాయకులు మాత్రం బండి సంజయ్ వంటి వ్యక్తికి అలాగే సమాధానం చెప్పాల్సిందే అంటూ కేటీఆర్ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us