Komati Reddy Venkat Reddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయం ఏమవుతుంది చెప్మా.?

NQ Staff - November 6, 2022 / 08:22 PM IST

Komati Reddy Venkat Reddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయం ఏమవుతుంది చెప్మా.?

Komati Reddy Venkat Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా.? భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారా.? వెంకటరెడ్డి సంగతి తర్వాత, అసలంటూ రాజగోపాల్ రెడ్డి పరిస్థితేంటి.? మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుల్లో ఈ అంశంపై తీవ్ర గందరగోళం కనిపిస్తోంది.

‘నేనే పీసీసీ అధ్యక్షుడిని అవుతా.. ఇప్పటికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యండి.. పార్టీ గురించి చూడొద్దు.. ఈసారికి బీజేపీ పార్టీకే ఓటెయ్యండి..’ అంటూ అనుచరులకు సూచించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మీద ప్రేమతో.

అనుచరులు అలా విడిపోయారా.?

కొందరేమో రాజగోపాల్ రెడ్డి వెంట నడిచారు.. బీజేపీకి మద్దతు పలికారు. ఇంకొందరేమో, ‘వెంకటరెడ్డి పీసీసీ అధ్యక్షుడవుతానంటున్నారు కదా.. కాంగ్రెస్ పార్టీతోనే వుండాలి కదా.?’ అంటూ కాంగ్రెస్ పార్టీకే అతుక్కుపోయారు.. ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు రెండుగా చీలిపోయారు.

ఒకవేళ కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు ఇలా రెండుగా చీలిపోకపోయి వుంటే, మునుగోడులో బీజేపీ గెలిచేదంటూ మునుగోడులో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

పోలింగ్ ముగిసింది.. ఫలితాలూ వచ్చేశాయ్.. ఇప్పుడు పోస్ట్‌మార్టమ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి.? అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చనే.!

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us