KCR : కేసీఆర్ నోట మాట డైలాగ్.. నువ్వు గోకిన గోకకపోయిన.. నేను గోకుతూనే ఉంటా అంటూ బీజేపీపై సెటైర్
NQ Staff - July 11, 2022 / 09:28 AM IST

KCR : తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. అందుకోసం తెగ కసరత్తులు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంపై తెగ విమర్శలు చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది బీజేపీ. మహరాష్ట్ర లో జరిగినట్లే తెలంగాణలో జరుగుతుందని కమలం నాయకులు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

KCR Press meet about BJP Narendra Modi
గోకుతూనే ఉంటా..
సమర్ధవంతమైన, సంక్షేమ పాలన అందిస్తున్న టీఆర్ఎస్ ను ఏక్‌నాథ్ షిండే లు, కట్టప్పలు ఏమీ చేయలేరని హెచ్చరిస్తూనే బీజేపీ కి కేంద్రంలో కూడా నూకలు చెల్లిపోయాయంటూ రివర్స్ అటాక్ చేశారు. విశ్వగురువుగా చెప్పుకునే మోదీ బ్యాంకులను లూటీ చేసే దొంగలకు విష్ గురువుని అభివర్ణించారు కేసీఆర్.
“మోదీ గారూ.. దమ్ముంటే తమిళనాడు, తెలంగాణలో ఏక్‌నాథ్ శిండేలను తీసుకురండి చూద్దాం. ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ రాజకీయమా..? ఇతర ప్రభుత్వాలను కూలగొట్టడం గొప్ప విషయమా..?” అని ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో కొత్త పార్టీ వద్దా? “మాతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్టే. నువ్వు గోక్కున్నా గోక్కోకపోయినా.. నేను మాత్రం గోకుతూనే ఉంటా?” అంటూ తనదైన శైలిలో చురకలంటించారు.
వర్షాలకు కాశీ ఘాట్‌లో ప్రధాన గోపురం కూలిపోయిందని.. అది దేశానికి అరిష్టమని ప్రజలు బాధపడుతున్నట్టు తెలిపారు. కానీ.. భాజపా మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటుందని కేసీఆర్ ధ్వజమెత్తారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని.. ఎల్‌ఐసీని అమ్మనీయమన్నారు. తమ అజెండా ఏంటో త్వరలో చెబుతామన్నారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
రాష్ట్రాల ప్రగతి దెబ్బతీసి దేశం గొంతు పిసుకుతారా?దేశాన్ని మోదీ సర్వనాశనం చేస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. కేవలం భాజపాయేతర ప్రభుత్వాల్ని ముప్పుతిప్పలు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గత అప్పులను లెక్కించి ఎఫ్‌ఆర్‌బీఎంలో కోతలు పెడుతున్నారన్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తును మోదీ సర్వనాశనం చేస్తున్నారు. కేంద్రంలో వికృత రాజకీయ క్రీడ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వం సైన్యాన్ని కూడా వదలట్లేదని కేసీఆర్ ఆక్షేపించారు. 130 కోట్ల దేశ జనాభాను ఇష్టమెచ్చినట్టు చేస్తామంటే కుదరదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధాన మంత్రి మోదీ. జీడీపీ అత్యంత పతనమైన మాట వాస్తవం కాదా? ద్రవ్యోల్బణం పెరిగిన మాట వాస్తవం కాదా? రూపాయి విలువ పతనం, పెట్రోల్ ధరల పెంపు, కోట్లాది ఉద్యోగాలు కోల్పోతున్న మాట వాస్తవం కాదా? దేశంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నది వాస్తవం కాదా? భాజపా మత పిచ్చి రాజకీయాలతో పెట్టుబడులు తరలిపోతున్నాయి.
మేకిన్ ఇండియా.. ఇదో పెద్ద డైలాగ్. దీపావళి టపాసులు, పతంగులు, జాతీయ పతాకాలు, గణపతి విగ్రహాలు చైనా నుంచి వస్తున్నాయి. దేశంలో 38శాతం పరిశ్రమలు మూతపడిన విషయం వాస్తవం కాదా? ఇదేనా మేకిన్ ఇండియ అంటే? అట్టర్ ఫ్లాప్ పథకం ఇది. బ్లాక్ మనీ వెనక్కి తెస్తామన్నారు.. స్విస్ బ్యాంకులో బ్లాక్ మనీ ఇప్పుడు డబులైపోయింది. మాటలు చెప్పే ఇంజిన్ కాదు… దిల్లీలో మంచిగా పనిచేసే ఇంజిన్ ఉండాలి అంటూ మోదీతో పాటు ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేసీఆర్.