KCR : నేడే విడుదల.! కొత్త పార్టీపై కేసీయార్ ప్రకటన.. కమింగ్ సూన్.!

NQ Staff - October 5, 2022 / 01:40 PM IST

KCR : నేడే విడుదల.! కొత్త పార్టీపై కేసీయార్ ప్రకటన.. కమింగ్ సూన్.!

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాను నడుపుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అనే ప్రాంతీయ పార్టీని, జాతీయ పార్టీగా మలచనున్న సంగతి తెలిసిందే.

మధ్యాహ్నం 1.19 నిమిషాల సమయంలో కేసీయార్, జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రకటన సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ ముఖ్య నేతలతో కేసీయార్ సంప్రదింపులు జరుపుతున్నారు.

కేసీయార్ ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పబోతున్నారు.?

సాయంత్రం నాలుగు గంటలకు కేసీయార్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్‌మీట్‌లోనే జాతీయ పార్టీకి సంబంధించి కీలక వివరాలు వెల్లడించే అవకాశం వుంది. జాతీయ పార్టీకి సంబంధించి తొలి బహిరంగ సభ వరంగల్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం.

మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ బహిరంగ సభకు కేసీయార్ సన్నాహాలు చేస్తున్నారట. సంక్రాంతి సమయంలో ఆ సభ వుంటుందని అంటున్నారు. కాగా, కేసీయార్ ప్రెస్‌మీట్‌లో పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

జాతీయ స్థాయిలో పలువురు ముఖ్య నేతలు హైద్రాబాద్ వచ్చి, కేసీయార్‌తో జాతీయ పార్టీపై మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. భారత రాష్ట్రీయ సమితి పేరుతో కేసీయార్ జాతీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని మలచనున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us