బీజేపీ దాటికి వెనక్కు తగ్గుతున్న కెసిఆర్. బీజేపీతో కెసిఆర్ కు తలనొప్పే అయింది కదా ?

Admin - December 15, 2020 / 05:12 PM IST

బీజేపీ దాటికి వెనక్కు తగ్గుతున్న కెసిఆర్. బీజేపీతో కెసిఆర్ కు తలనొప్పే అయింది కదా ?

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే మొన్నటివరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేకుండా ఉన్నప్పటికీ, ఒక్కసారిగా రాజకీయాల్లో మార్పులు సంభవించాయి. ఇక దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్య విజయంతో టీఆర్ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి. అయితే దుబ్బాకలో గెలిచిన ఊపును అలానే కొనసాగించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి దీటుగా సీట్లు సాధించింది. దీనితో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ తలనొప్పిగా మారింది. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిసారి కెసిఆర్ పై విరుచుకుపడుతూ వివాదాస్పదంగా మారుతున్నాడు.

bandi Sanjay pulled out of KCR scam

భారత్ బంద్ నాడు బీజేపీ పై టీఆర్ఎస్ విమర్శలు :
కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో మొన్న రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. ఇక ఆ బంద్ రోజు టీఆర్ఎస్ కు దొరికిందే సందురా అన్నట్లు బీజేపీ సర్కార్ పై, ప్రధాని మోడీ పై ఒక రేంజ్ లో విమర్శలు చేసారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీఆర్ఎస్ లో ఉన్న చిన్న లీడర్ నుండి బడా లీడర్ వరకు అందరు బీజేపీ సర్కార్ పై మాటలు తూటాల్లా వదిలారు.

 

ఢిల్లీకి కెసిఆర్.. మోడీపై ప్రశంసలు :
ఇక భారత్ బంద్ రోజు బీజేపీ పై, మోడీ పై విమర్శలు చేసినా టీఆరఎస్, మరుసటి రోజు గప్ చుప్ అయింది. టీఆర్ఎస్ నాయకుల నోట ఒక్కమాట కూడా బయటకు రాలేదు. ఇదిలా ఉంటె ఒక్కసారిగా ప్రధాని మోడీకి సీఎం కెసిఆర్ పొగుడుతూ లేఖ రాసారు. అలాగే హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యాడు సీఎం కెసిఆర్. ఇక ఇందుకోసమే కెసిఆర్ టీఆర్ఎస్ నాయకుల నోర్లు మూపించాడా అనే అనుమానం అందరిలో రేకెత్తింది.

కెసిఆర్ పై బండి విమర్శలు :
కెసిఆర్ ఢిల్లీకి వెళ్లి తిరిగి హైదరాబాద్ రాగానే, ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఢిల్లీ బాట పట్టారు. దీనితో తెలంగాణ ప్రజల్లో మరో ఆసక్తికరమైన అనుమానానికి దారి తీసింది. బండి సంజయ్ ఢిల్లీ పెద్దలతో సమావేశాలు అయిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో కెసిఆర్ పై ఒక రేంజ్ లో విమర్శలు చేసాడు. కెసిఆర్ పొర్లి పొర్లి దండం పెట్టిన.. జైలుకు పంపకుండా ఊరుకునే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు కెసిఆర్ చేసిన అవినీతిని కప్పుబుచ్చడానికి తామేము కాంగ్రెస్ పార్టీ కాదని, అక్కడ ఉంది మోడీ సర్కార్ అని హెచ్చరించాడు. అవినీతిపరులను మోడీ ఎప్పటికి వదలడని మండిపడ్డాడు.

bandi sanjay

బీజేపీ విమర్శలు.. కెసిఆర్ మాత్రం సైలెంట్ :
కెసిఆర్ పై బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు గాని, కెసిఆర్ గాని అస్సలు స్పందించడం లేదు. అలా బీజేపీ విమర్శలు చేస్తుంటే తిరిగి విమర్శలు చేయకపోతే.. లొంగిపోయారనే భావన ప్రజల్లో ఏర్పడుతుందని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఇక ఒకవైపు కెసిఆర్ మాత్రం ఎవ్వరు నోరు తెరవద్దని సందేశం ఇస్తున్నాడట. దీనితో కెసిఆర్ కు బీజేపీ కొరకని కొయ్యల మారింది.

కెసిఆర్ గురించి నోరదుపులో పెట్టుకొని మాట్లాడు : బాల్క సుమన్
బీజేపీ కెసిఆర్ పై ఎన్ని విమర్శలు చేస్తున్న ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించడం లేదు. కానీ తాజాగా ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందిస్తూ బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు రావలసిన మొండి బకాయిలు, ప్రాజెక్టులు, నిధుల గురించి కెసిఆర్ ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిసాడు. ఒక ఎంపీగా ఉండి కనీసం అది కూడా అర్ధం చేసుకోపోతే ఎలా ? ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి కనీసం అవగాహనా పెంచుకోవాలి. కెసిఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీ మాట్లాడే పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని బాల్క సుమన్ మండిపడ్డారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us