తెలంగాణ సీఎం కేసీఆర్ మరో రెండు దఫాల వరకు టీఆర్ఎస్ దే అధికారం అనే ధీమాతో ఇన్ని రోజులు వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ బలపడేందుకు కిందా మీద పడుతున్న సమయంలో బీజేపీకి అంత సీన్ లేదు అనుకుని కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దుబ్బాక ఉప ఎన్నికలు ఒక్కసారిగా కేసీఆర్ ను ఉలిక్కి పడేలా చేశాయి. బీజేపీ విజయం ఆ పార్టీ నాయకుల్లో ఆకాశమే హద్దుగా విశ్వాసంను నింపింది. దుబ్బాక ఎన్నికలు పూర్తి అయిన వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణపై పెద్దగా గతంలో శ్రద పెట్టని బీజేపీ అధినాయకత్వం దుబ్బాక ఉప ఎన్నికల విజయం తర్వాత కష్టపడితే తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయవచ్చు అనే నిర్ణయానికి వచ్చింది. అందుకే కేసీఆర్ ను డైరెక్ట్ గా ఎటాక్ చేసేందుకు బీజేపీ అధినాయకత్వం మరియు కేంద్ర మంత్రులు అంతా కూడా రంగంలోకి దిగారు.

బీజేపీ కేంద్ర మంత్రులు పలువురు మరియ జాతీయ అధ్యక్షుడు కూడా హైదరాబాద్ లో ప్రచారం చేయడంతో కేసీఆర్ కాస్త రక్షనాత్మక దోరణిలోకి నెట్టబడ్డట్లుగా అనిపిస్తుంది. ఆయన ఇప్పటికే ఎన్నికల్లో బీజేపీని కౌంటర్ చేసేందుకు పావులు కదుపుతున్నాడు. ఆ సమయంలో కేసీఆర్ చేస్తున్న చిన్న చిన్న తప్పులు మరియు ఆయన జారుతున్న మాటలతో బీజేపీకి దొరికి పోతున్నాడు. గతంలో మాదిరిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అగ్రెసివ్ గా మాట్లాడితే పని కాదు అనే విషయం అందరికి తెలుసు. కేసీఆర్ ను బీజేపీ తమ ట్రాప్ లోకి లాగేందుకు ప్రయత్నించి కొంత మేరకు సఫలం అయ్యిందని చెప్పాలి.
జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో అమిత్ షా.. ప్రధాని మోడీ కూడా పార్టీ నాయకులకు సలహాలు మరియు సూచనలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే బీజేపీ నేతలు చాలా అగ్రెసివ్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. యూపీ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమిత్ షా రోడ్డు షో.. జాతీయ అధ్యక్షుడు ప్రచారం అన్ని చూస్తుంటే గ్రేటర్ పై జెండా పాతి తర్వాత టార్గెట్ అసెంబ్లీగా బీజేపీ పావులు కదుపుతున్నట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి అమిత్ షా మరియు మోడీల గేమ్ ప్లాన్ అదిరింది కదా..!