Kabaddi Competitions in Suryapet : బ్రేకింగ్ న్యూస్ : సూర్యాపేటలో ప్రమాదం.. 100 మందికి పైగా గాయాలు..

Kabaddi Competitions in Suryapet : సూర్యాపేటలో ఈరోజు సోమవారం రాత్రి ప్రారంభం కావాల్సిన 47వ నేషనల్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలటంతో అందులో కూర్చున్నవారిలో సుమారు 100 మంది గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ కి తరలిస్తున్నారు. మిగతావారిని స్థానిక ఆసుపత్రుల్లో చేర్చించారు. గ్యాలరీల్లో దాదాపు 1500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాలరీ ఎందుకు కూలిందనేది తెలియరావట్లేదు. దీనికి ముఖ్యంగా రెండు కారణాలు దారితీసి ఉండొచ్చని పేర్కొంటున్నారు.

ఏంటవి?..

కెపాసిటీకి మించి ప్రేక్షకులు గ్యాలరీల్లో కూర్చోవటం ఒక కారణం కాగా గ్యాలరీ నిర్మాణంలో లోపం మరో కారణం కావొచ్చని భావిస్తున్నారు. అసలు కారణం ఏంటనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ గ్రౌండ్ లో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాలరీని 20 అడుగుల ఎత్తులో, 240 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేశారని సమాచారం. గ్యాలరీల నిర్మాణంలో ఉపయోగించిన ఐరన్ రాడ్లు కొంత మంది ప్రేక్షకుల మీద పడటంతో తీవ్ర గాయాలపాలైనట్లు చెబుతున్నారు.

Kabaddi Competitions in Suryapet : major accident in kabaddi competitions in suryapet
Kabaddi Competitions in Suryapet : major accident in kabaddi competitions in suryapet

ఇదే తొలిసారి: Kabaddi Competitions in Suryapet

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు గతంలో ఎప్పుడూ జరగలేదు. దీంతో వీటిని జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ప్రచారం కూడా పెద్దఎత్తున చేశారు. దీంతో ఈ పోటీలను చూడటానికి జనం బాగా వచ్చారు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో పోటీలు ప్రారంభం కానుండగా అనుకోకుండా ఇలా జరగటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ క్రీడాకారులు హాజరయ్యారు.

Advertisement