కే‌సి‌ఆర్ కుర్చీ దిగే టైమ్ వచ్చేసింది అంటున్న టాప్ లీడర్ – లైట్ తీసుకునే మనిషి కాదు ఆయన !

ఎన్నికలు దగ్గరపడడంలో అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది. హైదరాబాద్ లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలన్నీ ప్రచారంలో జోరు అందుకున్నాయి. అంతకముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా బీజేపీ పార్టీ విజయం సాధించింది .ఈ విజయంతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ మళ్ళీ గ్రేటర్ వార్ ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ సారి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టిపోటీనిచ్చేందుకు బీజేపీ తన ప్రచారంలో భాగంగా జాతీయ స్థాయి నేతలను బరిలోకి దించింది.

Cm kcr

ఈ క్రమంలో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. అయితే ఆయన కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు కురిపించారు. తెలంగాణలో కేసీఆర్ ను పదవిలో నుంచి దించే సమయం దగ్గరపడిందని నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అవినీతి పాలనను రూపుమాపేందుకు, నరేంద్ర మోడీ సారధ్యంలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్న వారికి నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంలో కొత్తపేట నుంచి నాగోల్ వరకు నిర్వహించిన రోడ్ షోలో టీఆర్ఎస్ పాలనపై నడ్డా విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని పార్టీని అన్ని డివిజన్లలోనూ గెలిపించాలని కోరారు. ప్రజలు అందరు కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోడ్ షోలో భారీ సంఖ్యలో బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో కేసీఆర్ కు విరుద్ధంగా నినాదాలు చేసారు. భారత్ మాతాకీ జై….జై శ్రీరామ్ అన్న నినాదాలతో రోడ్ షో నిర్వహించారు. . జై మోడీ…డౌన్ డౌన్ కేసీఆర్ అంటూ కార్యకర్తలు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేస్తామని త్వరలోనే తెలంగాణలో కమలం వికసిస్తుందని నడ్డా అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అవినీతి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, కొత్త హామీలతో ప్రజలను కేసీఆర్ మోసం చేసి ఓట్లను అడుగుతున్నారని చెప్పారు . బీసీలను పేదలను కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. ఈ క్రమంలో గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారని, మా పార్టీ గెలుపు కోసం, ప్రజల క్షేమం కోసం ఎక్కడికైనా వస్తానని నడ్డా అన్నారు. తెలంగాణలో కారు జోరు తగ్గిందని, త్వరలోనే కమలం వికసిస్తుందని తెలిపారు. మరి తెలంగాణాలో రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి మరి.. !! ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచుతారో అన్నా విషయం రాబోయే రోజుల్లో చూడాలి..

Advertisement
Advertisement