Jana Sena : తెలంగాణలో జనసేన అసలు పోటీ చేస్తుందా.?
NQ Staff - December 2, 2022 / 01:54 PM IST

Jana Sena : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. నిజానికి, కొంత పొలిటికల్ వాక్యూమ్ అయితే తెలంగాణలో కనిపిస్తోంది. ఇంతకీ, తెలంగాణ విషయంలో జనసేన పార్టీ ఆలోచన ఏంటి.? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరిగే అవకాశం వున్నందున, జనసేన పార్టీ కూడా ఇదొక అడ్వాంటేజ్.
అయితే, తెలంగాణ రాజకీయాల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోవడంలేదు. మొన్నామధ్య ఓ డజను సీట్లలో పోటీ చేసే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో జనసేన వుందా.? లేదా.?
జనసేనకి పడే ఓట్లు.. అంటే, అవి కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు మాత్రమే. ఆ లెక్కన అన్ని నియోజకవర్గాల్లోనూ ఖచ్చితంగా జనసేనకు ఓట్లున్నాయ్. అలాగని, ఓ అరడజను స్థానాల్లో అయినా జనసేన గెలిచే అవకాశం వుందా.? అంటే, గట్టి పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు.
అయితే, జనసేనకున్న ఆ కొన్ని ఓట్లు ప్రధాన రాజకీయ పార్టీల గెలుపోటముల్ని ప్రభావితం చేసే అవకాశమైతే లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఆయా రాజకీయ పార్టీల నుంచి పొత్తుల ప్రతిపాదనలు వస్తాయా.? అన్న కోణంలో జనసేనాని ఎదురుచూస్తున్నారట.
జనసేన ఓ ఐదు సీట్ల వరకు ఆశిస్తోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో రెండు సీట్ల వరకు గ్రేటర్ పరిధిలోనేనట.