Jagga Reddy : ఈయన ఆయనేనా.? గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కాంగ్రెస్ నేత.!
NQ Staff - November 11, 2022 / 08:56 PM IST

Jagga Reddy : కొందరు రాజకీయ నాయకులు ఓ గెటప్‌కి ఫిక్స్ అయిపోతారు.! ఆ గెటప్‌కి బ్రాండ్ అంబాసిడర్లయిపోతుంటారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా అంతే. జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
జగ్గారెడ్డి అనగానే, ఆయన గెటప్ గుర్తుకొస్తుంటుంది చాలామందికి. బాగా పెరిగిపోయిన జుట్టు, సాధువుని తలపించే గడ్డం. ఆయన ప్రత్యేకతలు. ‘వీధి రౌడీ’ అని కూడా కొందరు విమర్శిస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.
గెటప్ మార్చేసిన జగ్గారెడ్డి.. కారణమిదే..
కానీ, అనూహ్యంగా జగ్గారెడ్డి కొత్త లుక్‌లోకి మారిపోయారు. విషయమేంటంటే, ఆయన తాజాగా గుండు కొట్టించేసుకున్నారు. అదేనండీ, తలనీలాల్ని భక్తితో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి అర్పించారు. అద్గదీ అసలు సంగతి.
గుర్తు పట్టలేకుండా జగ్గారెడ్డి మారిపోవడంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. జగ్గారెడ్డి ఈ గుండు గెటప్‌లోకి మారడం ఇదే కొత్త కాదుగానీ, చాలా అరుదైన విషయం. చాలా చాలా అరుదుగా మాత్రమే జగ్గారెడ్డి గడ్డం లేకుండా కనిపిస్తారు.
అదండీ అసలు సంగతి.