Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ సోదాలు : 6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం.!

NQ Staff - November 24, 2022 / 06:24 AM IST

Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ సోదాలు : 6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం.!

Mallareddy : ఐటీ అధికారులు నిన్నటి నుంచి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, విద్యాసంస్థలు, కార్యాలయాపై జరిగిన సోదాల్లో భారీయెత్తున నగదు పట్టుబడింది. మొత్తంగా 6 కోట్ల రూపాయల నగదు, పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పలు విద్యా సంస్థల్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం నిర్వహిస్తున్నారు మల్లారెడ్డి.

అన్నీ సక్రమమేనంటున్న మల్లారెడ్డి..

విద్యాసంస్థలు, ఆసుపత్రి.. అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయనీ, ఎక్కడా అక్రమాలు జరగలేదని మంత్రి మల్లారెడ్డి అంటున్నారు. అయితే, ఫీజుల వసూళ్ళ విషయమై అక్రమాలకు పాల్పడ్డారనీ, నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తున్నారనీ, అదనంగా వసూలు చేసిన మొత్తాల్ని నగదు రూపంలో తీసుకుంటున్నారని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి.

లెక్కల్లో చూపని సొమ్ముని స్థిరాస్థి వ్యాపారంలో పెట్టడంతో పాటు మల్లారెడ్డి – నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చించారనీ అధికారులు చెబుతున్నారు.

నిజానికి, మెడికల్ అలాగే ఇంజనీరింగ్ కళాశాలలంటేనే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్. ఇది బహిరంగ రహస్యమే. మరి, మల్లారెడ్డి విషయంలో జరిగిన సోదాలు ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి.? మంత్రి మల్లారెడ్డి అరెస్టయ్యే పరిస్థితి వస్తుందా.? వేచి చూడాల్సిందే.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us