Mallareddy : మరో తెలంగాణ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు

NQ Staff - November 22, 2022 / 09:30 AM IST

Mallareddy : మరో తెలంగాణ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు

Mallareddy : తెలంగాణ కు చెందిన మరో మంత్రి మల్లారెడ్డి ఇంటి పై మరియు కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ నేడు తెల్లవారుజాము నుండి దాడులు మొదలు పెట్టింది. పదుల కొద్దీ బృందాలుగా విడి పోయిన ఐటీ అధికారులు మల్లారెడ్డి యొక్క ఇల్లు కాలేజీలు ఆఫీసులో తనికీలు నిర్వహిస్తున్నారు.

ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి యొక్క నివాసం అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి యొక్క ఇల్లు వ్యాపార సముదాయాలు కార్యాలయాలు ఇలా మల్లా రెడ్డికి చెందిన సొంత మరియు బంధు మిత్రుల యొక్క ఆఫీసులో మరియు నివాస స్థలాలపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మొత్తం 50 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతుంది. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న మల్లారెడ్డి ఫ్యామిలీ అక్రమ సంపాదన కలిగి ఉందని సమాచారం అందడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఐటి అధికారులు పేర్కొన్నారు.

ఈ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి.. మంత్రి మల్లారెడ్డి యొక్క ఆదాయం మరియు ఇతర విషయాల గురించి సాయంత్రం వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరో వైపు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఈ సోదాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం ను వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కుట్రతోనే ఈ సోదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us