Smita Sabharwal : మేడం స్మిత ట్విట్టర్‌కి గుడ్ బై చెప్పబోతున్నారా?
NQ Staff - November 19, 2022 / 10:39 AM IST

Smita Sabharwal : ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు అనుకువా.. అద్భుతమైన ప్రతిభ ఆమె సొంతం. కలెక్టర్ గా సుదీర్ఘ కాలంగా పని చేసిన ఆమె ప్రస్తుతం సీఎం క్యాంప్ ఆఫీసులో కీలక అధికారిగా ఉన్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా హోదాలో ఆమె ఉన్నారు. గొప్ప వ్యక్తిగా పేరు దక్కించుకున్న స్మిత సబర్వాల్ సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ మోటివేషనల్ పోస్టులు పెడుతూ అందరికీ సన్నిహితురాలు అయ్యారు.
అలాంటి స్మిత సబర్వాల్ ట్విట్టర్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా ప్రకటించారు. ట్విట్టర్ లో తనను ఫాలో అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ఇన్నాళ్లు ట్విట్టర్ లో అద్భుతమైన ఫన్ లభించింది అన్నట్లుగా ఆమె ట్వీట్ చేశారు. అయితే స్మిత సబర్వాల్ నిజంగానే ట్విట్టర్ కి గుడ్ బై చెప్తారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా గుడ్ బై ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ హ్యాష్ ట్యాగ్ నేపథ్యంలోనే స్మిత సబర్వాల్ పోస్ట్ పెట్టారని.. అంతే తప్ప ఆమె ట్విట్టర్ ఉన్నంత కాలం కొనసాగుతారని కొందరు భావిస్తున్నారు.
ఆమె ట్వీట్ ప్రస్తుతం సస్పెన్స్ కి తెరలేపింది. త్వరలోనే ఆమె మళ్ళీ ఒక ట్వీట్ చేసి క్లారిటీ ఇవ్వాలని ఆమెని ఫాలో అవుతున్నవారు కోరుకుంటున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన స్మిత సబర్వాల్ సోషల్ మీడియా లో ఇప్పుడు ఇంకా ఎంతో మందికి మోటివేషన్ ఇవ్వాలని ఆమె ఫాలోవర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
Incase its real #GoodByeTwitter
Thankyou to all ??
Had a lot of fun on this platform ? pic.twitter.com/hR3GFW9Vab— Smita Sabharwal (@SmitaSabharwal) November 18, 2022