దుబ్బాకలో ఓటమికి నేనే బాధ్యత వహిస్తా : మంత్రి హరీష్ రావు
Admin - November 10, 2020 / 06:21 PM IST

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు కోసం పోరాటం చేసి ఓటమి చెందింది అధికార టీఆర్ఎస్ పార్టీ. అయితే ఓట్ల లెక్కింపు నుండి మంచి పోటీ ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ వ్యూహలు ఫలించలేదు. ఇక ఎట్టకేలకు బీజేపీ గెలిచినా విషయం తెలిసిందే. అయితే అధికార పార్టీ ఓటమికి ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పందించాడు. ఇక ఇదే తరుణంలో దుబ్బాకలో కీలకంగా పనిచేసిన మంత్రి హరీష్ రావు కూడా స్పందించాడు.
ఇక ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలని, అలాగే గెలుపు కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని తెలిపాడు. దుబ్బాక ఓటమికి గల కారణాల గురించి సమీక్షిస్తామని చెప్పుకొచ్చాడు. ఒక విధంగా ఓటమికి గల బాధ్యత నేనే వహిస్తానని హరీష్ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికి టీఆర్ఎస్ పార్టీ ప్రజలందరికి అండగా నిలుస్తుందని వెల్లడించాడు.