జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా బీజేపీ మాత్రం ప్రచారంలో దూసుకుపోతుంది. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుకెళ్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను బయట పెడుతూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఇప్పటికే నగరంలో ఫ్రీ వైఫై లో జరిగే అవకతవకలు బయటపెట్టారు. ఇక ఇదే నేపథ్యంలో మరొక విషయాన్నీ బయట పెట్టారు.
అయితే నగరంలో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్ల కుంభకోణమని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా ఒక్క మీటర్ ఎల్ఈడి లైట్ల ధర కేవలం ముప్పై రూపాయల నుండి యాభై రూపాయలకు ఉంటుందని, దీన్నిబట్టి చూస్తే ఒక్క స్తంభానికి ఇరువై మీటర్లు ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇరువై మీటర్ల లైట్లకు 1000 రూపాయల నుండి 1500 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
కానీ ఈ లైట్లను ఒక్క స్తంభానికి పెట్టడానికి ఇరువై ఆరు వేల రూపాయల వరకు కాంట్రాక్టర్లకు సర్కార్ ఇచ్చిందని బయటపెట్టాడు. అంటే రూపాయి పెట్టి ఇరువై ఆరు రూపాయలు ప్రభుత్వం వసూల్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం ఇలా అడ్డగోలుగా ప్రజల దగ్గర దోచుకుంటుందని విమర్శలు చేసాడు. సర్కార్ ఏర్పాటు చేసిన ప్రతి పథకంలో ఈ విధంగానే అవినీతి జరుగుతుందని అర్వింది వెల్లడించాడు.