కేసీఆర్ గుండెల్లో గుబులు..కారణం అదేనా ?

కేసీఆర్ ఈ మధ్య ఎప్పుడు చేయనంత ఫోకస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై చేస్తున్నారు. ఇప్పుడు గనక బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే ఇక తెలంగాణాలో ఆ పార్టీ ఏకు మేకై కూర్చుంటుంది అనేది కేసీఆర్ కు బాగా తెలుసు. బీజేపీ గ్రేటర్ లో పది స్థానాలకు మించితే అది టీఆరెస్ కి పెద్ద తలకాయనొప్పిగా మారుతుంది అంటూ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

cm kcr
cm kcr

సొంత పార్టీలో అసంతృప్తి

టీఆరెస్ పార్టీ జెండాతో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యే లు ఇప్పటివరకు కేసీఆర్ మొహం చూడలేదు అంటే నమ్మాల్సిందే. అంతగా అయన తన సొంత పార్టీ నేతలను దూరం పెడతారు. మంత్రి పదవుల విషయంలోనూ అసంతృప్తి ఉన్న వారు ఉన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో ఆయనదే ఫైనల్ నిర్ణయం.

దుబ్బాక దెబ్బతో కేసీఆర్ ఇమేజ్ తగ్గిందా..?

కేసీఆర్ ఇమేజ్ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో సైతం ఈ అసంతృప్తి పెరుగుతుందని TRS పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ కి ఎన్నికలు నడుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యత సీఎం కేసీఆర్ తన వారసుడు కేటీఆర్ చేతిలో పెట్టాడు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఏమైనా తేడా జరిగితే ముందు బలయ్యేది కేటీఆర్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ మాత్రమే అభ్యర్థుల ఎంపిక

జీహెచ్ఎంసీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ అందుకే ప్రత్యేక దృష్టి పెట్టారు. అసంతృప్తి తో ఉన్నవారిని అస్సలు పట్టించుకోలేదు. సిట్టింగ్ కార్పొరేటర్లకు పెద్ద పీట వేసాడు. ముందు బీజేపీ పై కొంత నిర్లక్ష్య వైఖరిని చూపించిన ఇప్పుడు ఆ ఛాన్స్ తీసుకోవద్దని నిత్యం టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ ఎన్నికలు కేసీఆర్ ని ఎలా నిలబెడతాయి అనేది వేచి చూడాలి.

Advertisement