Harish: హరీష్ రావు ట్యాలెంట్ ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం

Harish: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు నాయకత్వ ప్రతిభను, తన శాఖపై ఆయనకున్న పట్టును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)లో హరీష్ రావుకు చోటు కల్పించింది. కొవిడ్ రిలీఫ్ మెటీరియల్ కి జీఎస్టీ నుంచి మినహాయింపులు, రాయితీలు ఇవ్వటంపై ఈ టీమ్ పనిచేస్తుంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేయాలని నిన్న శుక్రవారం జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయించారు. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా అధ్యక్షతన మొత్తం ఎనిమిది మందితో ఈ ‘జీఓఎం’ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులోకి హరీష్ రావుని తీసుకోవటం ద్వారా మోడీ సర్కారు తెలంగాణ గవర్నమెంట్ పనితీరును మెచ్చుకున్నట్లు భావించొచ్చు. వివిధ రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధిస్తుండటంతో కేంద్రం తెలంగాణకు ఈవిధంగా ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చిందని అంటున్నారు. తెలంగాణ పథకాలు బాగున్నాయంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లేటెస్టుగా నిన్న శుక్రవారమే ప్రశంసించిన విషయం తెలిసిందే.

Harish Rao

ఆర్థిక లోటు.. తక్కువ..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో అన్ని రాష్ట్రాల ఆదాయంలో ఆర్థిక లోటు 36.3 శాతం కాగా తెలంగాణలో 23.10 శాతం మాత్రమే అని హరీష్ రావు తెలిపారు. దేశంలో అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం కూడా తెలంగాణే అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇచ్చేందుకు ఇదే చివరి సంవత్సరం కాబట్టి పూర్తి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలు రుణాలు తీసుకునే శాతాన్ని మూడు నుంచి ఐదుకు పెంచాలని కూడా హరీష్ రావ్ కోరారు.

Harish Rao

అది సరికాదు..

న్యూట్రల్ ఆల్కహాల్(స్పిరిట్)ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం కరెక్ట్ కాదని హరీష్ రావు తేల్చిచెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోతుందని అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న జీఎస్టీ మండలి సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రేస్ కోర్స్ ఉన్నందున జీఎస్టీ మండలిలో ఎంటర్టైన్మెంట్ సెక్టార్ కేబినెట్ సబ్ కమిటీలో తెలంగాణకు సభ్యత్వం కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీంతో ఆయన్ని జీఓఎం మెంబర్ గా నియమించారు.