Harish Rao : బీజేపీ వదిలే బాణాలు.. ఆ పార్టీ డ్రామాలు ఇక్కడ పని చేయవు

NQ Staff - December 2, 2022 / 03:30 PM IST

Harish Rao  : బీజేపీ వదిలే బాణాలు.. ఆ పార్టీ డ్రామాలు ఇక్కడ పని చేయవు

Harish Rao  : ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు బిజెపి అధినాయకత్వం ఈడీ మరియు ఐటి లను పంపించడం సహజమే అంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీ రాజకీయాలు అందరికీ తెలుసని తెలంగాణలో బిజెపి కుట్రలు నడవు అంటూ ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు రావడం నేపథ్యం లో హరీష్ రావు మాట్లాడుతూ.. బిజెపి రాజకీయాలు దేశంలో అందరికీ తెలుసు, ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇలాంటి దాడులు బీజేపీ ప్రత్యర్థి పార్టీలపై చేయించడం సహజమే అన్నారు.

బిజెపి వదిలిన బాణాలు మరియు ఆ పార్టీ చేసే డ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో పని చేయవు అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపి నాయకులను నమ్మే పరిస్థితి లేదని, కేంద్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బిజెపికి గట్టి దెబ్బ తగలడం ఖాయం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు.

బిజెపి పార్టీ నాయకుల హడావుడికి టిఆర్ఎస్ పార్టీ బెదిరిపోదని, తెలంగాణ ప్రజలంతా కూడా ఈ వ్యవహారాలని చూస్తున్నారని ఆయన అన్నాడు. మంత్రులు మరియు ముఖ్యమైన టీఆర్‌ఎస్ నాయకులపై జరుగుతున్న ఐటీ దాడులు మరియు ఈడీ దాడులు అనైతికం అంటూ హరిష్ రావు పేర్కొన్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us