గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఇక జోష్ మొదలయినట్లే..!

Admin - November 17, 2020 / 11:36 AM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఇక జోష్ మొదలయినట్లే..!

తెలంగాణాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. అయితే మొన్న దుబ్బాక ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నిక రాష్ట్రంలో సందడి వాతావరణాన్ని నెలకొల్పింది. ఇక ఇదే తరుణంలో జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కూడా ముహూర్తం ఖరారయ్యింది. అయితే ప్రస్తుత కార్పొరేటర్ల పదవి కాలం ముగుస్తుండడంతో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసారు. అయితే నవంబర్ 18వ తేదీ నుండి నామినేషన్ల పక్రియ మొదలుకానుంది. ఇక నవంబర్ 20వ తేదీన నామినేషన్ల వేయుటకు చివరి రోజు కాగా, నవంబర్ 21వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక నవంబర్ 24వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ 1వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఇక ఎన్నికలు పూర్తయిన తరువాత డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఒకవైపు ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు అనేక సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గ్రేటర్ ఎన్నికలపైనే దృష్టి సారించారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ లో ఎలాగైనా వంద స్థానాలు గెలిచి సత్తా చాటాలని అన్ని విధాలా సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపడుతూ నగర వాసుల మన్ననలు పొందుతూ టీఆర్ఎస్.

 

అయితే ఈ గ్రేటర్ ఎన్నికల బాధ్యత ను టీఆర్ఎస్ నుండి మంత్రి కేటీఆర్ తీసుకోనున్నాడు. ఇక మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఈ గ్రేటర్ ఎన్నికపై కూడా అదే స్థాయిలో గెలుపొందాలని ఫుల్ జోష్ లో ఉంది. ఇక ఇప్పటికే ఆ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా ఎన్నికలపై ఓ కన్ను వేసింది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సంపాదించాలని ఆ పార్టీ నాయకులు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనప్పటికి ఈ గ్రేటర్ ఎన్నికలు అన్ని పార్టీలకు ఒక పెద్ద టాస్క్ గా మారింది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us