GHMC : నిజంగా ‘‘గ్రేటర్’’ హైదరాబాద్.. దేశంలోనే నంబర్ వన్ ప్లేస్..

GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేష్(జీహెచ్ఎంసీ) తన పేరును సార్థకం చేసుకుంది. నిజంగా ‘‘గ్రేటర్’’ హైదరాబాద్ అని నిరూపించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం అమలులో దేశంలోనే నంబర్ వన్ ప్లేసును ఆక్రమించింది. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. దీంతో నగరాల్లోని ప్రజలందరి మాదిరిగానే వీధి, చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వాళ్లను ఆర్థికంగా కాస్త ఆదుకోవటం కోసం మోడీ సర్కారు ‘‘పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్’’ స్కీమ్ ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఒక్కో వ్యాపారికి రూ.10 వేలు ఇచ్చారు. ఈ విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు లెవల్ లో 34,878 మందికి ఈ డబ్బులు అందించారు. దీంతో అత్యధిక లబ్ధిదారులతో బల్దియా ఇండియాలోనే తొలి స్థానంలో నిలిచింది. తర్వాత ఇండోర్, కాన్పూర్, వారణాసి ఉన్నాయి.

ప్రధాని సైతం ప్రశంసించేలా..

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీఎం పేరుతో ప్రవేశపెట్టిన ఒక పథకం ఆయన నియోజకవర్గం కన్నా హైదరాబాద్ లోనే బాగా అమలవుతుండటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలుచేస్తున్న నగరాల జాబితాలో మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నాలుగో స్థానంలో ఉండటం బీజేపీకి నామోషీ అని అంటున్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పటివరకు లక్షా 62 వేల 104 మంది చిరు వ్యాపారులను గుర్తించి లక్షా 54 వేల 335 మందికి ఐడెంటిటీ కార్డులు జారీ చేశారు. రూ.10 వేల ఆర్థిక సాయం కోసం 67 వేల 233 మంది అప్లై చేయగా 34 వేల 878 మందికి మంజూరు చేశారు.

GHMC : ghmc got number one place in india
GHMC : ghmc got number one place in india

ఎమ్మెల్సీకి ఏక్ దమ్ సమాధానం: GHMC

రేపటితో ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి కాబోతున్న బీజేపీ లీడర్ ఎన్.రాంచందర్ రావు మొన్న శాసన మండలిలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ ప్రజలకు సక్రమంగా అందేలా ఇక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ సాధించిన ఘనత ఆయనకు సరైన సమాధానమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement