KTR : తనను తాను ముసలోడిగా అభివర్ణించుకున్న మంత్రి కేటీఆర్
NQ Staff - October 21, 2022 / 01:46 PM IST

KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక విషయమై అభిమానులతో మరియు కార్యకర్తలతో సోషల్ మీడియా జనాలతో అభిప్రాయాలను పంచుకుంటూనే ఉంటాడు. తాజాగా ఆయన ఈ ఫోటోను షేర్ చేసి కళ్లద్దాలు పెడితేనే చదవగలుగుతున్నాను, దీన్నిబట్టి నేను అధికారికంగా ముసలి వాడిని అయినట్లే అనిపిస్తుంది అంటూ తన మీద తానే జోకేసుకున్నాడు.
46 సంవత్సరాల వయసున్న కేటీఆర్ ఉన్నత విద్య ను అమెరికా లో అభ్యసించి అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేసి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్రను పోషించాడు. ప్రస్తుతం ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఒకవైపు ఆయన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీతో ప్రధానమంత్రి అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆయన వెనుక కేటీఆర్ ఉండి నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒక విజన్ ఉన్న వ్యక్తిగా కేటీఆర్ ని ఆయన అభిమానులు అభివర్ణిస్తూ ఉంటారు అలాంటి కేటీఆర్ ముసలి వాడు అవుతున్నారంటే ఆయన అభిమానులు ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్.
Was in denial for a while but Can’t read without my Glasses now
Officially Old 😁 pic.twitter.com/9kT4Ppgn2W
— KTR (@KTRTRS) October 21, 2022