Etela Rajender : కేసీయార్ పంచన చేరడం కంటే ఛావడం బెటర్: మాజీ మంత్రి ఈటెల
NQ Staff - December 18, 2022 / 04:04 PM IST

Etela Rajender : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీని వీడి, తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరబోతున్నారా.? ఈటెల రాజేందర్‌కి ఉప ముఖ్య మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీయార్ సుముఖంగా వున్నారా.?
జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న కేసీయార్, తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి బలమైన నాయకత్వం కోసం పాతమిత్రుల్ని దగ్గర చేసుకుంటున్నారా.?
ఈ ప్రశ్నలకు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా, తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం విషయమై ఈటెల రాజేందర్ స్పందించారు. బీజేపీని వీడే ప్రసక్తే లేదని ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు.
కేసీయార్‌ని ఓడించడమే జీవిత లక్ష్యం..
‘నా ముందున్న జీవిత లక్ష్యం ఒకే ఒక్కటి.. అదే కేసీయార్‌ని ఓడించడం.. నన్ను రాజకీయంగా బదనాం చేశారు. తెలంగాణ సమాజం దృష్టిలో దోషిగా చూపాలని ప్రయత్నించారు..