Double Decker Buses : గుడ్ న్యూస్ : హైదరాబాద్ లో ఈవీ డబుల్ డెక్కర్ బస్సులు
NQ Staff - October 22, 2022 / 01:30 PM IST

Double Decker Buses : కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదు రోడ్ల మీద డబల్ డెక్కర్ బస్సులు తిరిగేవి అంటూ సోషల్ మీడియా లో అప్పుడప్పుడు ఫోటోలు వీడియోలు చూసిన ఈ తరం జనాలు ఇప్పుడు కూడా అవి ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు.
ఆ మధ్య మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..
మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు తీసుకు వచ్చే అవకాశం ఉంటే పరిశీలించండి అంటూ ఆర్టీసీ వారికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ కోరడంతో ఆర్టీసీ ఆ దిశగా అడుగులు వేసింది.
డబుల్ డెక్కర్ బస్సుల వల్ల పలు ఇబ్బందులు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఎలక్ట్రానిక్ డబల్ డెక్కర్ బస్సులను తీసుకు రావడం ద్వారా హైదరాబాద్ వాసుల కోరిక తీరడంతో పాటు చాలా వరకు ప్రయోజనం చేకూరుతుందని కొందరు నిపుణులు పేర్కొన్నారు.
అందుకు తగ్గట్లుగానే అతి త్వరలోనే హైదరాబాద్ రోడ్ల మీదకి ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సులు రాబోతున్నట్లుగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అతి త్వరలోనే పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ లు హైదరాబాద్ రోడ్లపై తిరగబోతున్నాయి.