Karimnagar: క‌రీంన‌గ‌ర్‌లో ఠాగూర్ సినిమాను త‌ల‌పించే సీన్.. !

Karimnagar: చిరంజీవి న‌టించిన ఠాగూర్ సినిమాలో ఆసుప‌త్రి వైద్యులు బ్ర‌తికున్న శ‌వానికే వైద్యం చేస్తూ ల‌క్ష‌లు దండుకుంటుడ‌గా, ఆ విష‌యాన్ని గుర్తించిన చిరంజీవి నిజ‌నిజాల‌ను బ‌య‌ట పెట్టి అరెస్ట్ చేయించ‌డం మ‌నం చూసాం. ఇప్పుడు అలానే కరీంనగర్‌లో ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. ఠాగూర్ సినిమాలో చనిపోయిన శవానికే చికిత్స అందిస్తే.. ఇక్కడ మాత్రం తమ ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తిని సీరియస్‌గా ఉన్నాడంటూ మరో ఆసుపత్రికి తరలించేందుకు యత్నించారు.

Dead Body was Tried to Shift to Another Hospital in Karimnagar
Dead Body was Tried to Shift to Another Hospital in Karimnagar

రోగుల మాన‌సిక ప‌రిస్థితిని కొన్ని ఆసుప‌త్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏ మాత్రం దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో వాళ్లు విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తమకు పూర్తిస్థాయి సౌకర్యాలు లేకున్నా రోగులకు చికిత్స అందిస్తూ .. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లలోని సాహితి అనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మెట్‌పల్లికి చెందిన మంజుల అనే మహిళ జ్వరంగా ఉందంటూ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. హఠాత్తుగా చికిత్స పొందుతున్న మంజుల పరిస్థితి సీరియస్‌గా ఉందంటూ వైద్యులు చెప్పారు. దీంతో హైదారాబాద్‌కు తీసుకువెళ్లాలంటూ సిరియస్‌నెస్ చేశారు. ఇందుకోసం అంబులెన్స్‌ను ఏర్పాటు సైతం చేశారు.

జ్వరంతో భాదపడుతున్న తన భార్య అంత సీరియస్‌ కావడంపై ఆమె భర్త లింగారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే అసుపత్రిలోపలికి వెళ్లి మంజులను పరీశీలించారు. దీంతో ఆయన షాక్‌కు గురయ్యాడు. తన భార్య చినిపోయందని గ్రహించాడు. దీంతో ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు . వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందంటూ శవంతో బైఠాయించారు.

పోలీసులు రంగప్రవేశం చేసిన పోలీసులు భాధితులతో మాట్లాడారు. వారికి సర్థిచెప్పి అక్కడి నుండి శవాన్ని పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని హమి ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.